విద్యార్థినులకు ఏటా రూ.30 వేల స్కాలర్‌షిప్
బాలికల విద్య కోసం అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ అందిస్తోన్న స్కాలర్‌షిప్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి విద్యార్థినులు, తల్లిదండ్రులకు సూచించారు. తెలంగాణలో 15 వేల మంది విద్యార్థినులకు ఏడాదికి రూ.30 వేల స్కాలర్‌షిప్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి, ఇంటర్మీడియేట్ పూర్తి చేసి ప్రభుత్వ లేదా ప్రైవేట్ కాలేజీల్లో డిగ్రీ, డిప్లొమా, ఇంజనీరింగ్, నర్సింగ్, మెడిసిన్ తదితర కోర్సుల్లో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు అని పేర్కొన్నారు. […]