కెసిఆర్ పోరాటం వల్లనే సమ్మక్క సారలమ్మ బ్యారేజీ సాధ్యమైంది
బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ పోరాటం వల్లనే సమ్మక్క సారలమ్మ బ్యారేజీ సాధ్యమైందని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ఈ బ్యారేజీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుమతులు సాధించినట్టు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి ఆయన వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఛత్తీస్‌ఘడ్‌తో యాభై ఎకరాల ముంపునకు సంబంధించి అంగీకారం కుదిరితే ఏవో గొప్పలు సాధించినట్టు ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. […]