రాహుల్‌పై అరుపులు మాని నిజాలు తేల్చండి: మాజీ సిఇసి ఖురేషీ
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీపై పదేపదే అరవడం కంటే ఎన్నికల సంఘం ఓటు చోరీపై దర్యాప్తునకు దిగడం మంచిదని ఎన్నికల సంఘం మాజీ ప్రధానాధికారి ఎస్‌వై ఖురేషీ చెప్పారు. దేశంలో ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ప్రతిపక్ష నేత రాహుల్ చెపుతున్నారు. ఎన్నికల సంఘం వీటికి సరైన సమాధానాలు ఇవ్వాల్సి ఉంది. దీనికి బదులుగా ఆయనపై అభ్యంతరకర రీతిలో దురుసుగా మాట్లాడటం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్ష నేత ఆరోపణలపై సరైన రీతిలో దర్యాప్తు […]