దులీప్ ట్రోఫీ ఫైనల్… కష్టాల్లో సౌత్ జోన్

బెంగళూరు: సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్ జట్టు కష్టాల్లో చిక్కుకుంది. భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ చేపట్టిన సౌత్ జోన్ శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి 33 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకోవాలంటే సౌత్ మరో 233 పరుగులు చేయాలి. ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ (26), మొహిత్ కాలే (38) ఇప్పటికే పెవిలియన్ చేరారు. స్మరణ్ రవిచంద్రన్ […]