భక్తుల డబ్బు కళ్యాణ మండపాల నిర్మాణానికి కాదు: సుప్రీం కోర్టు

governors duties begins

న్యూఢిల్లీ: దేవాలయాలకు భక్తులు సమర్పించే డబ్బులు కళ్యాణ మండపాల నిర్మాణానికి కాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఆలయ నిధులను ప్రభుత్వ విధులుగా పరిగణించలేమంటూ మద్రాస్ హైకోర్టుకు చెందిన మధురై బెంచ్ ఇటీవల ఇచ్చిన తీర్పుపై స్టే విధించేందుకు నిరాకరించింది. తమిళనాడు లోని ఐదు దేవాలయాలకు చెందిన నిధులతో రాష్ట్రం లోని వివిధ ఆలయాల ప్రాంగణాల్లో కల్యాణ మండపాల నిర్మాణానికి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై పిటిషనర్లు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం రాష్ట్ర […]

యాదగిరిగుట్టలో భక్తులకు హైటెక్-డిజిటల్ సేవలు

యాదగిరిగుట్ట యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని సందర్శించుకునేందుకు విచ్చేసే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే క్రమంలో శనివారం భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ఆరు కొత్త కియోస్క్ యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. సుమారు పది లక్షలు విలువతో యంత్రాలను భక్తుల సౌకర్యార్థం కెనరా బ్యాంక్ తమ సేవా కార్యక్రమంలో భాగంగా విరాళంగా అందించింది. ఈ కియోస్క్ యంత్రాలను భక్తులకు మరింత అనుకూలంగా ఉండే విధంగా ఆలయ ప్రాంగణంలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేశారు. అయితే ఒక్కో […]

భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలి: అనిల్

Better services provided tirumala devotees

తిరుమల: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు మరింత సేవా దృక్పధంతో, మరింత బాధ్యతగా సేవలు అందించాలని నూతనంగా బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ సింఘాల్ ఉన్నతాధికారులకు దశ దిశ నిర్దేశించారు. తిరుమల శ్రీ అన్నమయ్య భవన్ లోని సమావేశ మందిరంలో బుధవారం ఉన్నతాధికారులతో పరిచయ కార్యక్రమం, సమీక్షసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇఒ అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడారు. శ్రీవారి వార్షిక  బ్రహ్మోత్సవాలు కేవలం 2 వారాలు మాత్రమే ఉన్నాయని, గడువు లోపుగా […]

తిరుమలలో దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

Tirumala darshan devotees

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 19 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. మంగళవారం 70,828 మంది భక్తులు  శ్రీవారిని దర్శించుకున్నారు. 26,296 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 3.07 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.