బండి సంజయ్‌పై పది కోట్ల పరువు నష్టం దావా వేసిన కెటిఆర్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పది కోట్ల రూపాయల పరువునష్టం దావా వేశారు. ఫోన్ ట్యాంపింగ్ కేసులో బండి సంజయ్ నిరాధారమైన ఆరోపణ చేశారని పేర్కొంటూ రూ. 10 కోట్లకు సిటిసివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆరోపణలపై క్షమాపణ చెప్పాలని ఆగస్టు 11వ తేదీన సంజయ్‌కు కెటిఆర్ లీగల్ నోటీసులు పంపించారు. క్షమాపణ చెప్పడానికి బండి సంజయ్ నిరాకరించడంతో కెటిఆర్ సిటిసివిల్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను […]