మోహన్ లాల్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్‌ను భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. సినీ రంగానికి చేసిన సేవలను గుర్తించి మోహన్ లాల్‌ను దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. శనివారం కేంద్ర సమాచార, ప్రసారశాఖ ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. 2023 సంవత్సరానికి గానూ మోహన్‌లాల్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోనున్నారు. సెప్టెంబర్ 23న 71వ జాతీయ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవంలో […]