ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం
ఢిల్లీ: ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో రాధాకృష్ణన్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. సిపి రాధాకృష్ణన్ పూర్తి పేరు చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్. 1957లో అక్టోబర్ 20న తమిళనాడు రాష్ట్రం తిరుప్పూర్‌లో జన్మించారు. 1998, 1999లో కోయంబత్తూరు నుంచి ఎంపిగా గెలిచారు. […]