17వ మినీ హ్యాండ్‌బాల్ నేషనల్ ఛాంపియన్‌షిప్ గోడపత్రికను ఆవిష్కరించిన సిఎం

తెలంగాణ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 26 నుండి 29 వరకు నిజాం కళాశాలలో జరిగే 17వ హెచ్‌ఎఫ్‌ఐ మినీ హ్యాండ్బాల్ నేషనల్ ఛాంపియన్‌షిప్ పోస్టర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సోమవారం ఆవిష్కరించారు. క్రీడలకు ప్రోత్సాహాన్ని అందిస్తూ, రాష్ట్రంలోని యువత క్రీడల వైపు మరింత ఆసక్తితో ముందడుగు వేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి సుమారు 1200 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను […]

ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంట్‌ను ప్రభుత్వం ఇష్టారీతిన మారుస్తోంది: హరీష్‌రావు

రీజినల్ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) కోసం అలైన్‌మెంట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారీతిన మారుస్తోందని, రైతులు తమ భూములు కోల్పోకుండా నిలదీస్తామని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ, మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు.సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ మండలం గ్రామాల రైతులు సోమవారం హరీష్ రావును కలిశారు. ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంట్ మార్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. అలైన్‌మెంట్ మార్చి పేద రైతుల పొట్ట కొట్టడం దుర్మార్గమన్నారు. కాంగ్రెస్ అనాలోచిత చర్యల వల్ల రైతులు భూములు […]

జూబ్లీహిల్స్‌లో హిట్టు కొడదాం

మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధి: సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం ఉప ఎన్నికలో గెలుపొందినట్టే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరగబోయే ఉప ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థిని గెలిపించి అధిష్టానానికి కానుకగా ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పార్టీ నాయకులకు, కా ర్యకర్తలకు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆదివారం జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మె ల్సీ బి.మహేష్ కుమార్‌గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, […]

గొప్ప రాజనీతిజ్ఞడు బూర్గుల రామకృష్ణారావు:సిఎం రేవంత్ రెడ్డి,

CM Revanth Reddy

హైదరాబాద్ స్టేట్ తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు 58వ వర్ధంతి సందర్భంగా ఆదివారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. జిహెచ్‌ఎంసి వద్ద గల బూర్గుల రామకృష్ణారావు విగ్రహం వద్ద పలువురు ప్రముఖులు నివాళ్లు అర్పించారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పిసిసి) రాష్ట్రఅధ్యక్షుడు, శానసమండలి సభ్యుడు బి.మహేష్‌కుమార్ గౌడ్, బిసి సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బిసి కమిషన్ చైర్మన్ నిరంజన్, ఉర్దూ అకాడమి చైర్మన్ తాహెర్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచంద్రరావు, హర్యానా […]

అలాయ్ బలాయ్‌.. సిఎం రేవంత్ రెడ్డికి దత్తన్న ఆహ్వానం

వచ్చే నెల మూడో తేదీన నిర్వహించతలపెట్టిన అలాయ్ బలాయ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆహ్వానించారు. ఆదివారం మర్యాదపూర్వకంగా సిఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి కలుసుకుని ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా యధావిధిగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు దత్తాత్రేయ ముఖ్యమంత్రికి వివరించారు. Also Read: ఈ నెల 17 నుంచి పోషణ మాసం ప్రారంభం

ఇంజనీర్లకు సిఎం ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు

తమ మేధో శక్తితో మానవ మనుగడకు ఎన్నో ఫలాలు అందించిన ఘనత ఇంజనీర్తదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇంజనీర్ల డే సందర్భంగా ఇంజనీర్లందరికీ సిఎం శుభాకాంక్షలు తెలిపారు. దేశ ఆర్ధికాభివృద్ధికి, భారతావని ప్రగతికి బలమైన పునాదులు నిర్మించిన భారతరత్న మెక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినం సందర్భంగా ఆయన జ్ఞాపకార్దం సెప్టెంబర్ 15న ఇంజనీర్స్ డేగా జరుపుకోవడం జరుగుందని సిఎం పేర్కొన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజనీరుగా, దార్శనికుడిగా విద్యాప్రదాతగా, నిపుణుడిగా, పారిశ్రామిక ప్రగతి చోదకుడిగా ప్రత్యేక చాటారన్నారు. అత్యుత్తమ […]

పది టిఎంసిల నీటిని ఏపి మళ్లీస్తోంది: సిఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy

ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని ముఖ్యమంత్రి అన్నారు. గడిచిన పదేళ్లలో అధికారంలో ఉన్న కెసిఆర్ ప్రభుత్వం కృష్ణా జలాల్లో న్యాయపరంగా రావాల్సిన నీటి కోటా సాధించటంలో దారుణంగా విఫలమైందన్నారు. కృష్ణాపై తలపెట్టిన పాలమూరు నుంచి డిండి వరకు ప్రాజెక్టు లను పెండింగ్‌లో పెట్టిందని, నీటి వాటాల విషయంలో తీరని ద్రోహం చేసిందన్నారు. దిగువ రాష్ట్రాల హక్కులతో పాటు నదీ వాటాల పంపిణీ న్యాయ సూత్రాల ప్రకారం కొత్తగా […]

68 జిఓను రద్దు చేసి హోర్డింగ్ ఏజెన్సీల సమస్యలను పరిష్కరించాలి

జిఓ 68ని రద్దు చేసి హోర్డింగ్ ఏజెన్సీల సమస్యలను పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. జిఓ 68 ని రద్దు చేస్తామని, హోర్డింగ్‌లపై అధికార పార్టీ గుత్తాదిపత్యాన్ని తొలగించి వాటిపై ఆధారపడిన కుటుంబాలను రక్షిస్తామని గత జిహెచ్‌ఎంసి ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ హామినిచ్చిందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 21 నెలలు దాటినా […]

బుల్లెట్ రైలును రప్పిద్దాం

మన తెలంగాణ/హైదరాబాద్: కొత్తగా అభివృద్ధి చేస్తున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రతిపాదనలకు అనుగుణంగా హైదరాబాద్‌ చెన్నై, హైదరాబాద్- బెంగుళూరు హైస్పీడ్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుల సర్వే, అలైన్‌మెంట్ ప్రతిపాదనలను మరోసారి పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైల్వే అధికారులకు సూచించారు. తెలంగాణలో పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు, లైన్లను వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి స్ప ష్టం చేశారు. అవసరమైన నిధులను సమకూర్చడంతో పాటు భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం […]

గాంధీ సరోవర్‌కు రక్షణ భూములు!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం భేటీ అయ్యారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం 98.20 ఎకరాల రక్షణశాఖ భూములు తెలంగాణ రాష్ట్రానికి బదలాయించాలని కోరారు. మూసీ, ఈసీ నదుల సంగమ సమీపంలో గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. జాతీయ సమైక్యత, గాంధేయ విలువలకు సంకేతంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిలుస్తుందని తెలిపారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టులో గాంధీ సిద్ధాంతాలను […]