విద్య, వైద్యం జాతీయీకరణ జరగాలి
విద్య-, వైద్య రంగాలలో నెలకొన్న అసమానతలు తొలగించకుండా సామాజిక,-ఆర్థిక-, రాజకీయ -సాంస్కృతిక రంగాలలో సమానత్వం సాధించడం అసాధ్యం. ప్రజల మధ్య సోదర భావం, జాతీయ ఐక్యత, సమైక్యత సాధించాలంటే విద్య,-వైద్య రంగాలను ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగిస్తూ నాణ్యత ప్రమాణాలు పాటించేలా తగు చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ విద్య, -వైద్య సంస్థలపై ప్రజలకు విశ్వాసం కలిగించేందుకు తగిన కృషి జరపాలి. అంతర్గత వలసాధిపత్యాన్ని, వనరుల దోపిడీ, తరలింపును నిరసిస్తూ తెలంగాణ ప్రజలు ప్రజాస్వామిక పద్ధతుల్లో సుదీర్ఘకాలం పోరాడి తెలంగాణ […]