సెంట్రల్ సాఫ్ట్ వేర్ వాడి ఓటర్లపేర్లు తొలగించారు: రాహుల్ గాంధీ
కేంద్ర ఎన్నికల సంఘంపై లోక్ సభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచేందుకు పుష్కలంగా అవకాశం ఉన్న బలమైన నియోజకవర్గాలలో ఓటర్లను మూకుమ్మడిగా తొలగించారని ఆరోపించారు. ఇందుకు సాఫ్ట్ వేర్ ఉపయోగించి కేంద్రీకృత పద్ధతులలో దారుణాలకు పాల్పడ్డారని ఆయన అన్నారు. ఈ ఓటరు ఐడీలను వేరే రాష్ట్రాలలో నుంచి, నకిలీ లాగిన్ లు, ఫోన్ నెంబర్ లను ఉపయోగించి కుట్రపూరితంగా తొలగించారని రాహుల్ […]