కేబుల్ ఆపరేటర్లకు ప్రత్యామ్నాయం చూపండి:రాంచందర్ రావు
కేబుల్ ఆపరేటర్లకు ప్రత్యామ్నాయం చూపించండి అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. కేబుల్ వైర్లను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహారిస్తున్నదని ఆయన విమర్శించారు. శుక్రవారం అనేక మంది కేబుల్ ఆపరేటర్లు తార్నాకలోని రాంచందర్ రావు నివాసానికి వెళ్ళి ఎదుర్కొంటున్న సమస్యను వివరిస్తూ వినతి పత్రం అందజేశారు. అనంతరం రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపించకుండా కేబుల్ వైర్లను తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. […]