బరువెక్కుతున్న బాలభారతం
దేశంలో సగం మంది పిల్లలు బక్కపలచగా, మరో సగంమంది భారీ ఊబకాయంతో నాణేనికి బొమ్మాబొరుసు లాగా బాలభారతం అఘోరిస్తోంది. రక్తహీనత, పౌష్టికాహారలోపం, దృష్టి లోపాలు, న్యూరో సైకిక్ సమస్యలు అన్ని అరిష్టాలు ప్రపంచ దేశాల్లో మనం ముందున్నాం. పిల్లల్లో ఎదుగుదల నిలిచిపోయి గిడసబారినవారు 36%, తగినంత బరువులేనివారు 17%, ఏ పని స్వతంత్రంగా చేసుకోలేని వారు నిరర్థక జీవితం అనుభవిస్తున్నవారు 6% ఉన్నారు. 60% పిల్లలు ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు లేకపోవడం, పౌష్టికాహరం లేకపోవడం, అపరిశుభ్రత వాతావరణం […]