గ్రూపు 1 పరీక్షను తిరిగి నిర్వహించండి: బూర నర్సయ్య గౌడ్

గ్రూపు 1 పరీక్షను తిరిగి నిర్వహించాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపి బూర నర్సయ్య గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గ్రూపు 1 పరీక్ష, నియామకాలు సరైన విధంగా జరగలేదని ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గ్రూపు 1 నిర్వహించగా, అది కూడా అనేక అవకతవకలు, అవినీతి కారణంగా పరీక్ష రద్దయ్యిందని ఆయన గుర్తు చేశారు. పరీక్షల నిర్వహణ విషయంలో […]