ఢిల్లీలో వందకు పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు
న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో శనివారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో వందకు పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తనిఖీలు పూర్తయిన తరువాత ఇవి వట్టి బూటకమేనని తేలింది. టెర్రరైజర్స్ 111 అనే పేరుతో ఓ గ్రూపు నుంచి బెదిరింపులు వచ్చాయని పోలీసులు చెప్పారు. ఇదివరకు కూడా ఈ గ్రూపు ఈ మెయిళ్ళ ద్వారా బెదిరింపులు పంపిందని తెలిపారు. ద్వారక లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, క్రిష్ణా మోడల్ పబ్లిక్ స్కూల్, సర్వోదయ విద్యాలయ, సిఆర్‌పిఎఫ్ […]