బోధన్‌లో ఉగ్రవాది పట్టివేత.. భయాందోళనలో స్థానికులు..
బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్‌లో (Nizamabad Bhodhan) అనుమానిత ఉగ్రవాదిని ఎన్‌ఐఎ అధికారులు పట్టుకున్నారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానిక పోలీసుల సహకారంతో బోధన్ పట్టణంలో బుధవారం తెల్లవారు జామున ఎన్‌ఐఎ, పటియాలా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఐసిస్‌తో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తొలుత బోధన్ కోర్టు ఆ వ్యక్తిని ప్రవేశపెట్టి అనంతరం పటియాలాకు తరలించారు. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా ఎన్‌ఐఎ, ఢిల్లీ స్పెషల్ పోలీసులు […]