తెలంగాణ పూలసింగిడి బతుకమ్మ
పల్లె, పట్నం యావత్ తెలంగాణ కూడళ్ళు ఆడపడుచుల వేడుకలై, పూలసింగిడులై సందడి చేయబోతున్నాయి. తొమ్మిది రోజుల పాటు ఆటపాటలతో కష్ట, సుఖాల మధ్య ఆటవిడుపుగా ఆత్మీయ బంధాల సమ్మేళనంగా సాగే ‘బతుకమ్మ పండుగ’ నేటి నుంచి మొదలవుతుంది. ప్రకృతి సంబంధాలు, మానవ సంబంధాల మేళవింపు ఉత్సవంగా ఈ బతుకమ్మ పండుగ ఉంటుంది. అనేక జీవరాశుల మనుగడకు కారణభూతమైన భూమి ని, నీరుని గౌరవించి, పూజించే సంస్కృతి బొడ్డెమ్మ పండుగ, బతుకమ్మ పండుగల్లో కన్పిస్తుంది. మన పూర్వీకులను గుర్తుచేసుకుని […]