బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనలో తెలంగాణ దేశానికి ఆదర్శం:మంత్రి పొంగులేటి

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలబడుతుందని రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాలు, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్ది అన్నారు. గురువారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలోని తన నివాసంలో ఈనెల 15న కామారెడ్డిలో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లపై మంత్రులు సీతక్క, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి, ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, […]