రెవెన్యూ అధికారుల వేధింపులు..భార్యా పిల్లలతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
రెవెన్యూ అధికారులు వేధిస్తున్నారంటూ ఓ ఆటో డ్రైవర్ తన భార్య, పిల్లలతో సహా ఆత్మహత్యకు యత్నించారు. పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించగా.. ఆటో కాలిపోయిన ఘటన మహబూబ్‌నగర్‌లో సోమవారం జరిగింది. వివరాలలోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం బస్వాయిపల్లిలో తన తాత పేరిట ఉన్న 1.28 ఎకరాల ఇనాం భూమిని తన పేరుపై మార్చుకునేందుకు దేవరకద్ర తహసీల్దారు కార్యాలయంలో ఆటోడ్రైవర్ శంకర్ దరఖాస్తు చేసుకున్నాడు. ఆర్డీవో కార్యాలయానికి ఆన్‌లైన్‌లో దస్త్రం వెళ్లగా.. ఆఫ్‌లైన్‌లో తమకు రాలేదని […]