ఆసియా కప్ 2025: యుఎఇకి తొలి విజయం

అబుదాబి: ఆసియాకప్‌లో భాగంగా సోమవారం ఒమన్‌తో జరిగిన గ్రూప్‌ఎ మ్యాచ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) 42 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో యుఎఇకి ఇదే తొలి విజయం కావడం విశేషం. ఇక ఒమన్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన యుఎఇ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 172 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఓపెనర్లు అలీషాన్ షరాఫు, మహ్మద్ వసీం అద్భుత బ్యాటింగ్‌తో […]

దాయాదుల పోరులో కనిపించన జోష్.. చప్పగా సాగిన భారత్-పాక్ మ్యాచ్

Team India

దుబాయి: ఆసియాకప్ టి20 టోర్నమెంట్ గ్రూప్‌ఎలో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య పోరు జరిగిన సంగతి తెలిసిందే. దుబాయి వేదికగా జరిగిన ఈ మ్యాచ్ చాలా సప్పగా సాగింది. దాయాదుల సమరం అంటే ఇరు దేశాల అభిమానుల్లో ఎనలేని జోష్ నెలకొంటోంది. ఈ మ్యాచ్‌ను చూసేందుకు రెండు దేశాల క్రికెట్ ప్రేమీలు ఎంతో ఆసక్తి చూపుతారు. వేదిక ఏదైనా చిరకాల ప్రత్యర్థుల సమరం చివరి వరకు నువ్వానేనా అన్నట్టు సాగడం అనవాయితీ. కానీ […]

హాంకాంగ్‌తో మ్యాచ్‌.. బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక

Srilanka

దుబాయ్: ఆసియాకప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా హాంకాంగ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక (Srilanka) 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అదే జోరుతో హాంగ్‌కాంగ్‌పై కూడా విజయం సాధించాలని శ్రీలంక జట్టు భావిస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్‌ జట్టుతో ఓటమిని ఎదురుకున్న హాంగ్‌కాంగ్ జట్టు ఈ మ్యాచ్‌లో తిరిగి పుంజుకోవాలని పట్టుదలతో ఉంది. తుది జట్లు: శ్రీలంక(Srilanka): పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(కీపర్), […]

యుఎఇతో మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఒమాన్

OMAN

అబుదాబి: ఆసియా కప్‌లో భాగంగా షేక్ జాయెద్ స్టేడియం వేదికగా యుఎఇతో జరుగుతున్న మ్యాచ్‌లో ఒమాన్ (OMAN) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్‌లో ఈ రెండు జట్లు ఆడిన మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలయ్యాయి. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ఇరు జట్లను కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచి బోణీ కొట్టాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. అయితే ఒమాన్ బ్యాటింగ్‌కి ఆహ్వానించడంతో తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన యుఎఇ వికెట్ కాపాడుకుంటూ […]

నో షేక్‌హ్యాండ్.. పాకిస్తాన్ కు భారత్ షాక్(వీడియో)

దుబాయ్ : స్థానిక దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత క్రికెట్ జట్టు తమదైన భారతీయతను చాటుకుంది. ఆదివారం రాత్రి భారత్ పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ పూర్తిగా భావోద్వేగాల నడుమ సాగింది. మ్యాచ్ ఆరంభంలో టాస్ తరువాతి క్రమంలో ఇరుదేశాల క్రికెట్ జట్ల క్యాప్టెన్ల పరస్పర కరచాలనం ఆనవాయితీ. అయితే భారత క్రికెట్ జట్టు క్యాప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ దశలో పాక్ క్రికెట్ జట్టు క్యాప్టెన్ సల్మాన్ అలీ ఆగాకు షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించారు. ఆయనను […]

పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం

ఆసియా కప్ 2025లో భాగంగా జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టుపై టీమిండియా ఘన విజయం సాధించింది. పాక్ నిర్దేశించిన 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఓపెనర్లు అభిషేక్ శర్మ(31), శుభ్ మన్ గిల్(10)లు శుభారంభం అందించారు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్(47 నాటౌట్), తిలక్ వర్మ(31)లు రాణించడంతో భారత్ 15.5 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 131 పరుగులు చేసింది. దీంతో పాక్ పై భారత జట్టు 7 […]

ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్

Pakistan

దుబాయ్: ఆసియాకప్‌లో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్‌ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ (Pakistan) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. హార్థిక్ పాండ్యా వేసిన తొలి ఓవర్ మొదటి బంతిని వైడ్‌గా ఎక్స్‌ట్రా పరుగు రాగా.. మరోసారి వేసిన మొదటి బంతికి జట్టు ఓపెనర్ సైమ్ అయూబ్(0) బుమ్రాకు క్యాచ్ ఇచ్చి […]

ఆసియాకప్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్

India VS Pakistan

దుబాయ్: ఆసియాకప్-2025లో హై-వోల్టేజీ మ్యాచ్‌కి రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ ఈ మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ (India VS Pakistan) జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకూ ఈ రెండు జట్లు చెరో మ్యాచ్‌లో విజయం సాధించాయి. భారత్, యుఎఇపై 9 వికెట్ల తేడాతో విజయం సాధించగా.. పాకిస్థాన్, ఒమాన్‌పై 93 పరుగుల తేడాతో నెగ్గింది. అయితే ఇప్పుడు ఈ రెండు జట్ల మధ్య […]

సమరానికి సర్వం సిద్ధం.. నేడు పాక్తో భారత్ పోరు

దుబాయి: ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం జరిగే గ్రూప్‌ఎ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. ఇరు జట్లు ఇప్పటికే చెరో విజయం సాధించి జోరుమీదున్నాయి. యుఎఇతో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా రికార్డు విజయాన్ని అందుకుంది. ఒమన్‌తో జరిగిన పోరులో పాకిస్థాన్ కూడా భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో రెండు జట్లు ఈ మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. పాక్‌తో పోల్చితే టీమిండియా అన్ని విభాగాల్లో చాలా బలంగా ఉందని చెప్పాలి. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని […]

ఒమాన్‌తో మ్యాచ్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్

Pakistan

దుబాయ్: ఆసియాకప్-2025లో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా.. తమ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ జట్టు పసికూన ఒమాన్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ (Pakistan) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్‌కి ముందు పాకిస్థాన్.. అఫ్ఘానిస్థాన్, యుఎఇతో ముక్కోణపు సిరీస్‌లో పాల్గొంది. గత రెండు-మూడు నెలలుగా తమ జట్టు మంచి క్రికెట్ ఆడుతుందని టాస్ సందర్భంగా పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా అన్నాడు. ఇక ఒమాన్ కెప్టెన్ జితేందర్ సింగ్.. మాట్లాడుతూ.. తమ […]