ఏయూలో విద్యార్థి మృతి
ఆంధ్రప్రదేశ్ విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సకాలంలో వైద్యం అందక బీఎడ్ విద్యార్థి మృతి చెందాడని, వర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వైస్ ఛాన్సలర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నిరసన కొనసాగించారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే బీఎడ్ రెండో సంవత్సరం చదువుతున్న విజయమూరి వెంకట సాయి మణికంఠ (25) గురువారం ఉదయం 7:30 గంటల సమయంలో శాతవాహన […]