ఎయిర్ ఇండియా విమానం ఇంజిన్ లో ఇరుక్కున్న పక్షి
ఎయిర్ ఇండియా విమానానికి మరో పెను ప్రమాదం తప్పింది. గురువారం విశాఖ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్లో పక్షి ఇరుక్కోవడంతో ఫ్యాన్ రెక్కలు దెబ్బతిన్నాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. వివరాల్లోకి వెళితే.. గురువారం మధ్యాహ్నం 2:20 గంటలకు హైదరాబాద్ బయలుదేరిన ఈ విమానం ఇంజిన్లో పక్షి ఇరుక్కొని ఫ్యాన్ రెక్కలు దెబ్బతినడంతో […]