రైలు లాంచర్ నుంచి అగ్ని క్షిపణి పరీక్ష
న్యూఢిల్లీ : భారత్ ఆయుధ శక్తి అజేయదశకు చేరుకునే ఘట్టం ఆవిష్కృతం అయింది. 2000 కిలోమీటర్ల దూరం వరకూ దూసుకువెళ్లే అణు సామర్థంతో ఉన్న అగ్ని ప్రైమ్ క్షిపణిని మన దేశం తొలిసారి రైలు పై నుంచి విజయవంతంగా పరీక్షించింది. రైలుపై అమర్చి ఉన్న ప్ర యోగస్థలి నుంచి ఓ అజ్ఞాత ప్రదేశం నుంచి ఈ శక్తివంత క్షిపణిని ప్రయోగించారు. ఈ పరీక్ష ఒక్కరోజు క్రితం జరిగిందని తెలిపిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ గురువారం ప్రకటించారు. డిఆర్‌డిఒ […]