ఎసిబి వలలో ఆర్ఐ, డిప్యూటీ సర్వేయర్
అవినీతి అధికారులు ఎంతమంది పట్టుబడిన ప్రభుత్వ ఉద్యోగంలో పని చేస్తున్న అధికారులలో మార్పు రావడం లేదు. ప్రతిరోజు ఏదో ఒకచోట ఎసిబి వలలో లంచగొండి అధికారులు చిక్కుతున్నారు. తాజాగా ఈ ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట తహశీల్దార్ కార్యాలయంలో చోటు చేసుకుంది. కొత్తకోట మండల పరిధిలోని నిర్వేన్ గ్రామానికి చెందిన ఓ రైతు తన ఇనాం భూమిని ఓఆర్ చేసుకోవాలని దరఖాస్తు చేసుకోగా సంబంధిత ఆర్ఐ వాసు, డిప్యూటీ సర్వేయర్ నవీన్ రెడ్డిలు ఆదేశాలు జారీ చేశారు. […]