గుట్టలుగా నోట్ల కట్టలు.. ఎసిబికి చిక్కిన మరో అవినీతి తిమింగలం

ఎసిబికి చిక్కిన మరో అవినీతి తిమింగలం ఇబ్రహీంబాగ్ ఎడిఈగా ఇళ్లల్లో ఎసిబి సోదాలు రూ.2.18కోట్ల నగదు స్వాధీనం.. రూ.50కోట్లకు పైగా అక్రమాస్తులు పది ప్రాంతాల్లో ఎసిబి అధికారుల సోదాలు ఎడిఈ అంబేద్కర్ అరెస్టు, రిమాండ్‌కు తరలింపు మనతెలంగాణ, సిటిబ్యూరోః అక్రమాస్తుల కేసులో మరోభారీ తిమింగలం ఎసిబికి చిక్కింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నరన్న ఆరోపణలతో ఎసిబి అధికారులు విద్యుత్ శాఖ ఎడిఈ ఇల్లు, బంధువుల ఇళ్లపై ఎసిబి మంగళవారం దాడులు చేశారు. ఎసిబి అధికారుల దాడులో […]

కిస్మత్ పూర్ లో మహిళ దారుణ హత్య

రాజేంద్ర నగర్ రాజేంద్రనగర్ కిస్మత్ పూర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని మహిళ పై కొందరు దుండగులు అత్యచారం చేసి హత్య చేశారు. వివరాలలోకి వెళితే..పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..కిస్మత్ పూర్ బ్రిడ్జి కింద మహిళ మృత దేహంను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృత దేహం పై బట్టలు లేకపోవడం ఆత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు అనుమానించారు.మృతి చెందిన […]

వైద్యం వికటించి యువతి మృతి

నాచారంలోని సత్య లాప్రోస్కోపిక్ హాస్పిటల్ లో వైద్యం వికటించి శైలేజ (22) అనే యువతి మృతి చెందిన సంఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. యాదాద్రి జిల్లా సూళ్లూరు గ్రామానికి చెందిన శైలజ అనే యువతి కడుపు నొప్పితో వస్తే అపెండిక్స్ ఆపరేషన్ చేసి ఆ యువతి ప్రాణాల మీదకు తెచ్చారు. అపెండిక్స్ ఆపరేషన్ వికటించడంతో ఆసుపత్రి యాజమాన్యం గత్యంతరం లేక వేరే ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. దాంతో సికింద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో […]

నాలాలో మిస్సింగ్.. ఇంకా దొరకని ఆచూకీ.. కుటుంబసభ్యుల ఆగ్రహం

Hyderabad

హైదరాబాద్: కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు నగరాన్ని (Hyderabad) అతలాకుతలం చేశాయి. మూడు రోజుల క్రితం భారీ వర్షం కురియడంతో పలు ప్రాంతాల్లో రోడ్లన్ని జలమయమయ్యయి. ఈ క్రమంలో వాహనదారుడు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకున్నారు. అయితే అఫ్జల్‌సాగర్, వినోబానగర్‌లో ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా నాలాలు ఉప్పొంగాయి. ఈ క్రమంలో నాలాల్లో ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోయారు. గల్లంతైన అర్జున్, రాము, దినేష్‌లుగా గుర్తించారు. అయిుతే గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. డిఆర్ఎఫ్, […]

భాగ్యనగరంలో భారీ వర్షం… ముగ్గురు గల్లంతు

Hyderabad Heavy rains

హైదరాబాద్: భాగ్యనగరంలో భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయంగా మారాయి. గంట వ్యవధిలోనే దాదాపు 12 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఆయా ప్రాంతాలలో లోతట్టు ప్రాం తాలు, రహదారులు జలమయమయ్యాయి. వీధుల్లో వరదలు పోటెత్తాయి. ముగ్గురు యువకులు వరదల్లో గల్లంతయ్యారు.  ఆసిఫ్ నగర్ ప్రాంతం హబీబ్ నగర్‌లో మామ, అల్లుడ్లు వరదలో కొట్టుకుపోయారు.   ముషీరాబాద్ ప్రాంతం వినోద నగర్‌లో పిట్టగొడపై సన్నీ అనే యువకుడు కూర్చొని స్నేహితులతో మాట్లాడతున్నాడు. గోడ కూలిపోవడంతో సన్నీ నాలాలో […]

మత్తు పదార్థాలను తయారుచేస్తున్న మేధా పాఠశాల సీజ్

మన తెలంగాణ/కంటోన్మెంట్: బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో కలకలం సృష్టించిన అల్పాజోలం మత్తు పదార్థాలను తయారు చేస్తున్న ఉన్నత విద్యాశాఖ అధికారులు ఆదివారం మేధా పాఠశాలను సీజ్ చేశారు.దీంతో పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను వేరొక పాఠశాలల్లో చేర్పించాలని నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలను సీజ్ చేయటంతో పాఠశాల చదవుతున్న విద్యార్థుల భవిష్యత్తుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గంజాయి అమ్మడం లేదని… కిడ్నాప్ చేసి చితకబాదారు

Kidnapped and beaten

హైదరాబాద్: గంజాయి విక్రయించడం లేదని ఇద్దరు వ్యక్తులను గుర్తు తెలియని దుండగులు (Kidnapped and beaten) కిడ్నాప్ చేసి చితకబాదారు. ఈ సంఘటన హైదరాబాద్ లోని పాతబస్తీ ప్రాంతం భవాని నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గతంలో షాబాజ్, ఫయిమ్ అనే యువకులు గంజాయి విక్రయించేవారు. గత అర్దరాత్రి పన్నెండు గంటల సమయంలో గంజాయి కావాలని ఆరుగురు దుండగులు ఆటోలో వచ్చారు. తమకు గంజాయి కావాలని దుండగులు కోరారు. Also Read: మూలాలు మరచి.. విన్యాసాలెందుకు? తాము […]

కుమారుడిని చంపి… మూటకట్టి మూసీలో పడేశాడు

Old city area Bandlaguda

హైదరాబాద్: అనారోగ్య సమస్యలు ఉన్నాయని కుమారుడిని కన్నతండ్రి చంపేసి మూట కట్టి మూసీలో పడేశాడు. ఈ సంఘటన హైదరాబాద్ లోని పాతబస్తీ ప్రాంతం బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలలో జరిగింది. మహమ్మద్ అక్బర్ అనే వ్యక్తి బండ్లగూడలో నివసిస్తున్నాడు. అతడికి అనారోగ్య సమస్యలతో ఉన్న కుమారుడు ఉన్నాడు. దీంతో కుమారుడు చంపి అనంతరం సంచిలో మూటకట్టాడు. బాలుడి మృతదేహాన్ని సంచిలో తీసుకెళ్లి నయా పుల్ బ్రిడ్జి పైనుంచి మూసీలో పడేశాడు. ఆపై ఏమీ తెలియదన్నట్లు బాబు కనిపించడం […]

హైదరాబాద్ మెట్రోలో ప్యాంట్ జిప్ తీసి..

Unzip pants Hyderabad Metro

హైదరాబాద్: మెట్రోలో అసభ్యకరమైన పనిచేసి హైదరాబాద్ బ్రాండ్ పేరుకు ఓ యువకుడు కళంకం తెచ్చాడు. రద్దీగా ఉన్న మెట్రో బోగీలోకి ఓ యువకుడు ఎక్కి, ప్యాంట్ జిప్ తీసి ఓ మహిళను వెనుక నుంచి తాకుతూ శునకానందం పొందాడు. పక్కనున్న ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందనే తెలియాల్సి ఉండగా అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు […]

పాతబస్తీలో సిమ్ బాక్స్ తో మోసాలు… హాంకాంగ్‌ మహిళ హస్తం

SIM box fraud

హైదరాబాద్: చంద్రాయణగుట్టలో సిమ్ బాక్స్ ఏర్పాటు చేసి ఇంటర్నేషనల్ కాల్స్‌ ను లోకల్ కాల్స్‌గా మార్చుతూ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌ ను పోలీసులు అరెస్టు చేశారు. టిజి సైబర్ సెక్యూరిటీ బ్యూరో, టెలికమ్యూనికేషన్ శాఖ సంయుక్త ఆపరేషన్‌ చేయడంతో సిమ్ బాక్స్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ముగ్గురు నిందితులు హిదాయతుల్లా, ఆమద్ ఖాన్, షోయబ్ లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఒక సిమ్ బాక్స్, దాదాపు 200 సిమ్ కార్డులను స్వాధీనం […]