ఈ నెల 17 నుంచి పోషణ మాసం ప్రారంభం
ఈ నెల 17 నుంచి అక్టోబర్ 16 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పోషణ మాస మహోత్సవాన్ని నిర్వహించనున్నట్టు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. చిన్నారులు, మహిళల ఆరోగ్యం, పోషకాహారాన్ని మెరుగుపర్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మహోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తోంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా అంగన్వాడీ సిబ్బంది ద్వారా ప్రతి ఇంటికీ పోషణ సందేశం చేరవేసేలా ప్రభుత్వం కార్యచరణ సిద్దం చేసింది. పోషణ మాసం మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులంతా […]