అక్రమ నిర్మాణాలను తొలిగించాల్సిన అవసరం ఉంది: కమిషనర్ రంగనాథ్

Many drains problematic

హైదరాబాద్: చాలా నాలాలు సమస్యాత్మకంగా మారాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైదరాబాద్ లో నాలాలు కబ్జా అయ్యాయని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అక్రమ నిర్మాణాలను తొలిగించాల్సిన అవసరం ఉందని, అక్రమ నిర్మాణాలు నాలాల నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారాయని ఆవేదనను వ్యక్తం చేశారు. కొన్ని ఇళ్లు తొలగించాలని నిర్ణయించామని అన్నారు. హైడ్రా ఉన్నది ప్రజల కోసమేనని సమస్యలు పరిష్కరిస్తామని కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. Also Read : కాలేజీలు బంద్ చేస్తే విద్యార్థుల పరిస్థితి ఏంటి?: […]

ఫైనల్‌లో సౌత్‌జోన్ చిత్తు.. దులీప్‌ ట్రోఫీ విజేత సెంట్రల్ జోన్

Duleep Trophy

బెంగళూరు: దేశవాళీ క్రికెట్‌లో ప్రతిష్టాత్మక దులీప్‌ ట్రోఫీని (Duleep Trophy) సెంట్రల్ జో్న్ కైవసం చేసుకుంది. బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్‌లో సౌత్‌జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో రజత్ పటిదార్ తన నాయకత్వంలో కొన్ని నెలల వ్యవధిలో గెలిచిన రెండో టైటిల్ ఇది. ఐపిఎల్ 18వ ఎడిషన్‌లో రజత్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును విజయ తీరాలకు చేర్చిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ (Duleep Trophy) […]

ఫీ రీయింబర్స్ మెంట్ లో కాంగ్రెసోళ్లకు 20 శాతం కమీషన్లు: కవిత

Fee reimbursement commission

హైదరాబాద్: ఆడబిడ్డల చదువులను కాంగ్రెస్ కమీషన్ల సర్కారు కాలరాస్తోందని ఎంఎల్ సి కవిత మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా ఫీ రీయింబర్స్ మెంట్ బకాయిలను తెలంగాణ ప్రభుత్వం ఎగవేస్తుందని దుయ్యబట్టారు. సోమవారం ఆమె తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 20 శాతం కమీషన్లు ఇస్తేనే రీయింబర్స్ మెంట్ బకాయిలు ఇస్తామని ప్రభుత్వంలోని కొందరు డిమాండ్ చేస్తున్నారని… దీంతో కాలేజీల యాజమాన్యాలు ఆవేదన చెందుతున్నాయని ఆరోపణలు చేశారు. కమీషన్ల కోసమే బకాయిలు ఏళ్లకేళ్లుగా పెండింగ్ లో పెట్టారని, ఇప్పటికే కాలేజీలు […]

కవితతో విష్ణువర్ధన్ రెడ్డి భేటీ…. జూబ్లీహిల్స్ అభ్యర్థి?

Vishnuvardhan Reddy meets Kavitha

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో ఎంఎల్ఎ కవిత తరపున అభ్యర్థిని బరిలోకి దించే అవకాశం ఉంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి సమావేశమయ్యారు. ఇద్దరు మధ్య దాదాపుగా అరగంటకు పైగా మంతనాలు సాగాయి. ఉపఎన్నికలో విష్ణును పోటీకి దించే యోచనలో కల్వకుంట్ల కవిత ఉన్నట్టు సమాచారం. Also Read:  నో షేక్‌హ్యాండ్.. పాకిస్తాన్ కు భారత్ షాక్(వీడియో) బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా దివంగత ఎంఎల్‌ఎ మాగంటి గోపీనాథ్ సతీమణి […]

భారత్ ప్రథమ స్థానంలో నిలవాలి: చంద్రబాబు

Telugu people top world

అమరావతి: సామాజిక న్యాయాన్ని పరిగణిస్తూ సమర్థతకు పెద్దపీట వేస్తున్నామని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రపంచంలోనే తెలుగు వాళ్లు అగ్రస్థానంలో ఉండాలనేదే తన ఆలోచన అని అన్నారు. ఈ సందర్భంగా సిఎం మీడియాతో మాట్లాడుతూ.. డబుల్ ఇంజిన్ సర్కార్, డబుల్ డిజిట్ గ్రోత్ అని 15 శాతం వృద్ధిరేటు సాధించగలగాలని తెలియజేశారు. తలసరి ఆదాయం పెంచేలా కృషి చేయాలని, ఈ ప్రభుత్వం రాగానే నిర్దిష్టమైన విధానం వికసిత్ భారత్ 2047 తయారు చేసిందని పేర్కొన్నారు. మనం […]

కాలేజీలు బంద్ చేస్తే విద్యార్థుల పరిస్థితి ఏంటి?: బండి

Bandi Sanjay comments congress

హైదరాబాద్: బిఆర్ఎస్ మాజీ సిఎం కెసిఆర్ పదేళ్ల పాలనలో రూ. వేల కోట్ల బకాయిలు పెట్టారని బిజెపి కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించకపోవడం దుర్మార్గం అని అన్నారు. ఈ సందర్భంగా మంచిర్యాలలో బండి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలన వచ్చినా పరిస్థితి మారలేదని, కాలేజీలకు టోకెన్లు టైంపాస్ చేస్తున్నారని విమర్శించారు. కాలేజీలు బంద్ చేస్తే విద్యార్థుల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని […]

జూబ్లీహిల్స్‌లో హిట్టు కొడదాం

మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధి: సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం ఉప ఎన్నికలో గెలుపొందినట్టే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరగబోయే ఉప ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థిని గెలిపించి అధిష్టానానికి కానుకగా ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పార్టీ నాయకులకు, కా ర్యకర్తలకు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆదివారం జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మె ల్సీ బి.మహేష్ కుమార్‌గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, […]

‘ది ప్యారడైజ్’లో కీలక పాత్ర..

హిట్: ది థర్డ్ కేస్’తో మంచి విజయం సాధించిన నేచురల్ స్టార్ నాని, ఇప్పుడు తన కెరీర్‌లోనే అతిపెద్ద చిత్రమైన ‘ది ప్యారడైజ్’లో నటిస్తున్నారు. ‘ది ప్యారడైజ్’ సినిమాలో కీలక పాత్రలో మోహన్ బాబు నటిస్తున్నారట. ఆన్ లొకేషన్ స్టిల్స్‌లో కూడా ఆ విషయం బయటపడింది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా మాత్రం ఇంకా ప్రకటించలేదు. తాజాగా మంచు లక్ష్మి ఈ విషయాన్ని ప్రకటించేసింది. ‘ది ప్యారడైజ్’ సినిమాలో నాన్న నటిస్తున్నారని, చాలా ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నారంటూ […]

లండన్‌లోనూ వలసల కొలిమంటుకుంది

లండన్: బ్రిటన్ చరిత్రలోనే అతి పెద్ద వలస వ్యతిరేకవాదుల భారీ ప్రదర్శన శనివారం సెంట్రల్ లండన్ లో జరిగింది. వలస వ్యతిరేక కార్యకర్త టామీ రాబిన్సన్ నాయకత్వంలో “యునైట్ ది కింగ్ డమ్‌” పేరుతో లక్షన్నరమందికి పైగా నిరసన కారులు వలసవాదానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. ఈ ప్రదర్శనల సమయంలో అనేకమంది అధికారులపై దాడి జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. వారిని పంపివేయండి, మాదేశాన్ని మాకు మళ్లీ ఇవ్వండి, ఇంగ్లీషు చాలు, మా పిల్లల భవిష్యత్ కాపాడండి అని వారు […]

మేడారంపై చిల్లర రాజకీయాలు

మన తెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి: వచ్చే సంవత్సరం 2026 మేడారం మహా జాతరకు అటవీ మార్గాల ద్వారా నూతన రోడ్లు ఏ ర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర పంచాయితీ రాజ్, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. మేడారం మహా జాతరకు అటవీ ప్రాంతం నుండి వచ్చే భక్తుల కోసం కాల్వప ల్లి, బయ్యక్క పేట, కొండపర్తి, గోనేపల్లి మార్గాలను ఆదివారం రాష్ట్ర పంచాయితీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క జిల్లా ఎస్పీ డాక్ట ర్ […]