ఐసిసిప్లేయర్ ఆఫ్‌ది మంత్‌గా సిరాజ్

దుబాయి: టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్, హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ ప్రతిష్ఠాత్మకమైన ఐసిసి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును అందుకున్నాడు. ఆగస్టులో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో, చివరి టెస్టు మ్యాచ్‌లో అసాధారణ బౌలింగ్‌ను కనబరిచిన సిరాజ్ ఏకంగా 9 వికెట్లు పడగొట్టాడు. తీవ్ర ఒత్తిడిలోనూ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అతని ప్రతిభకు గుర్తింపుగా ఆగస్టు నెలకు సంబంధించి ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డును దక్కించుకున్నాడు. […]

దాయాదుల పోరులో కనిపించన జోష్.. చప్పగా సాగిన భారత్-పాక్ మ్యాచ్

Team India

దుబాయి: ఆసియాకప్ టి20 టోర్నమెంట్ గ్రూప్‌ఎలో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య పోరు జరిగిన సంగతి తెలిసిందే. దుబాయి వేదికగా జరిగిన ఈ మ్యాచ్ చాలా సప్పగా సాగింది. దాయాదుల సమరం అంటే ఇరు దేశాల అభిమానుల్లో ఎనలేని జోష్ నెలకొంటోంది. ఈ మ్యాచ్‌ను చూసేందుకు రెండు దేశాల క్రికెట్ ప్రేమీలు ఎంతో ఆసక్తి చూపుతారు. వేదిక ఏదైనా చిరకాల ప్రత్యర్థుల సమరం చివరి వరకు నువ్వానేనా అన్నట్టు సాగడం అనవాయితీ. కానీ […]

చట్ట విరుద్ధంగా ఉంటే.. ‘సర్’ను రద్దు చేస్తాం: సుప్రీం హెచ్చరిక

governors duties begins

రాజ్యాంగబద్ధ సంస్థ నిబంధనలు పాటించిందనే భావిస్తున్నాం 7న తుది వాదనలు వింటాం, ఆ తర్వాత తీర్పు దేశ వ్యాప్తంగా నిలుపదల చేయలేం బీహార్ ఓటరు జాబితా సమగ్ర సవరణపై సుప్రీం వ్యాఖ్యలు న్యూఢిల్లీ : బీహార్ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు ఎన్నికల కమిషన్ అనుసరించిన పద్ధతిలో ఏదైనా చట్టవిరుద్ధంగా కనిపిస్తే మొత్తం ‘ఎస్‌ఐఆర్’ను రద్దు చేస్తామని సుప్రీం కోర్టు ఎన్నికల కమిషన్‌ను సోమవారం హెచ్చరించింది. అయితే రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల సంఘం ఎన్నికల […]

బండి సంజయ్‌పై పది కోట్ల పరువు నష్టం దావా వేసిన కెటిఆర్

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పది కోట్ల రూపాయల పరువునష్టం దావా వేశారు. ఫోన్ ట్యాంపింగ్ కేసులో బండి సంజయ్ నిరాధారమైన ఆరోపణ చేశారని పేర్కొంటూ రూ. 10 కోట్లకు సిటిసివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆరోపణలపై క్షమాపణ చెప్పాలని ఆగస్టు 11వ తేదీన సంజయ్‌కు కెటిఆర్ లీగల్ నోటీసులు పంపించారు. క్షమాపణ చెప్పడానికి బండి సంజయ్ నిరాకరించడంతో కెటిఆర్ సిటిసివిల్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను […]

రవితేజ వారసుడి నెక్ట్స్‌ మూవీ.. ఫస్ట్‌లుక్ అదుర్స్

Maadhav Bhupathiraju

టాలీవుడ్‌లో ఎవరి సపోర్ట్ లేకుండా హీరోగా ఎదిగారు మాస్ మహారాజా రవితేజా. ఆయన ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో మాధవ్ భూపతిరాజు(Maadhav Bhupathiraju). మిస్టర్ ఈడియట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు మాధవ్. ఇప్పుడు ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘మారెమ్మ’. ఈ సినిమాలో దీపా బాలు హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి అప్‌డేట్ వచ్చింది. ఈరోజు మాధవ్ పుట్టినరోజు కావడంతో గ్లింప్స్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ గ్లింప్స్‌లో మాధవ్ (Maadhav […]

‘ఒజి’ నుంచి మరో పాట.. ‘గన్‌ అండ్ రోజెస్’ అదిరిపోయిందిగా..

Guns n Roses

పవన్‌కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఒజి’. సెప్టెంబర్ 25వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో చిత్ర బృందం ప్రమోషన్స్‌లో వేగం పెంచేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతీ అప్‌డేట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘గన్‌ అండ్ రోజెస్’ (Guns n Roses) అనే పాటను విడుదల చేశారు. యాక్షన్ సన్నివేశాలతో కూడిన ఈ పాట పవన్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. యానిమేషన్‌లో ఉన్న ఫైటింగ్ సీక్వెన్స్‌లు […]

‘మిరాయ్’కి ఆర్‌జివి రివ్యూ.. ఏమన్నారంటే..

Ram Gopal Varma

తేజా సజ్జా, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం ‘మిరాయ్’. సెప్టెంబర్ 12న విడుదలైన ఈ గ్రాండ్ సక్సెస్‌ను సాధించింది. భారీ రాకలెక్షన్లు రాబడుతూ.. బాక్పాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇప్పటికే పలువురు సినీ విశ్లేషకులు ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఈ సినిమాపై రివ్యూ ఇచ్చారు. ‘‘విఎఫ్ఎక్స్ ఇంత గ్రాండ్‌ చివరిసారి ఎప్పుడు చూశానో గుర్తులేదు. 400 కోట్లకు పైగా చిత్రాల్లో […]

రైతులు భూములు కోల్పోకుండా ప్రభుత్వాన్ని నిలదీస్తాం: హరీశ్

Harish Rao comments Revanth Reddy

హైదరాబాద్: ఆర్ఆర్ఆర్ కోసం అలైన్ మెంట్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారీతిన మారుస్తోందని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. రైతులు భూములు కోల్పోకుండా ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు. ఈ సందర్భంగా హరీశ్ మీడియాతో మాట్లాడుతూ.. అలైన్ మెంట్ మార్చి పేద రైతుల పొట్ట కొట్టడం దుర్మార్గమని, కాంగ్రెస్ అనాలోచిత చర్యల వల్ల రైతులు భూములు కోల్పోయే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. సిఎం రేవంత్ రెడ్డి సొంత భూములకు మేలు కలిగేలా అలైన్ మెంట్ మార్చడం […]

10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి : జగదీశ్ రెడ్డి

BRS MLAs Additional Secretary

హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై బిఆర్ఎస్ పార్టీ నిర్ణయం చెప్పాలని తమకు 3 రోజులు గడువు ఇచ్చారని బిఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణను తమకు తెలియజేశారని అన్నారు. శాసనసభ అదనపు కార్యదర్శి ఉపేందర్ రెడ్డిని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణపై బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభిప్రాయం చెప్పారు. ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణపై శాసనసభాపక్షం అభిప్రాయం అందించారు. 10 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు […]

దయచేసి డబ్బులు పంపకండి.. ఫ్యాన్స్‌కి హీరో విజ్ఞప్తి

Upendra

కన్నడ సూపర్‌స్టార్ హీరో ఉపేంద్రకు (Upendra) ఊహించని సమస్య ఎదురైంది. ఆయన ఫోన్ హ్యాకింగ్‌కి గురైంది. దీంతో తన ఫోన్‌ నుంచి కాల్స్‌ని ఎవరూ లిఫ్ట్ చేయవద్దని.. తన భార్య ఫోన్ నుంచి కూడా కాల్ చేసి డబ్బులు అడిగితే ఎవరూ పంపవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన సోషల్‌మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశానని.. ఆయన పేర్కొన్నారు. తన భార్య ప్రియాంక ఆర్డర్ చేసిన […]