హాంకాంగ్ పై ఆఫ్ఘాన్ భారీ విజయం

Afghanistan vs Hong Kong

అబుదాబి: ఆసియా కప్‌లో హాంకాంగ్‌పై ఆప్ఘనిస్థాన్ ఘన విజయం సాధించింది. 94 పరుగులు తేడాతో ఆప్ఘాన్ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘాన్ 189 పరుగుల లక్షన్ని హాంకాంగ్ ముందు ఉంచింది. హాంకాంగ్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో ఆఫ్ఘాన్ విజయ దుందుభి మోగించింది. ఆప్ఘాన్ బ్యాట్స్‌మెన్లలో సెదికుల్లా అతల్ 73 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. అజమతుల్లా 53 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. నబీ […]

పసికూన యుఎఇతో టీమిండియా ఢీ… రాత్రి 8.30 మ్యాచ్ ప్రారంభం

Ind vs UAE

దుబాయి: ఆసియాకప్ టి20 టోర్నమెంట్‌లో టీమిండియా తన తొలి మ్యా చ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)తో తలపడనుంది. బుధవారం దుబాయి వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఆసియాకప్‌లో భారత జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లు బరిలో ఉన్నా టీమిండియాకే ట్రోఫీ గెలిచే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. గ్రూప్‌బిలో భారత్‌తో పాటు యుఎఇ, పాకిస్థాన్, ఒమన్ జట్లు ఉన్నాయి. యుఎఇతో జరిగే మ్యాచ్‌లో ఘన విజయం సాధించడం ద్వారా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో […]

ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్

C. P. Radhakrishnan

న్యూఢిల్లీ : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ గెలుపొందారు. మొత్తం 781 మంది పార్లమెంట్ సభ్యులకు గాను 767 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇది 98.2 శాతం ఓటర్ టర్నౌట్‌ను సూ చిస్తుంది. భారత రాష్ట్ర సమితి, బీజేడీ, శిరోమణి అకాళీదళ్ సభ్యులు ఓటు వేయలేదు. ఉప రాష్ట్రపతి అభ్యర్థులుగా ఎన్డీ యే తరఫున సీపీ రాధాకృష్ణన్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టి స్ బి సుదర్శన్ రెడ్డి […]

రీవాల్యూయేషన్.. కుదరకపోతే మళ్లీ పరీక్ష

మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రూప్ 1 పరీక్షలపై హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు చెప్పింది. ఇప్పటికే నిర్వహించిన ఈ పరీక్షా ప్ర శ్నా పత్రాలను పునః మూల్యాంకనం చేయాల ని అది సాధ్యం కానిపక్షంలో పరీక్షలను తిరిగి నిర్వహించాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఇందుకు గాను ఎనిమిది నెలల గడువును కూడా ధర్మాసనం ఇచ్చింది. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయని, తమ ప్రశ్నా పత్రాలను అర్హత లేని వారితో […]

మంటల్లో నేపాల్

ఖాట్మండూ: హిమాలయ రాజ్యం నేపాల్‌లో వరుసగా రెండో రోజూ హింసా త్మక ఆందోళనలు చెలరేగాయి. 20మందికిపైగా పోలీసు కాల్పుల్లో చనిపో వడం, మరికొంత మంది గాయాలపాలు కావడంతో నిరసనకారులు మంగళ వారంనాడు మరింత రెచ్చిపోయారు. నేపాల్ పార్లమెంట్ భవనం, పార్టీ కా ర్యాలయాలతో పాటు రాజకీయ నాయకుల నివాసాలు, వారి బంధువులపై దాడులకు తెగబడ్డారు. ఇళ్లకు, కార్యాలయాలకు నిప్పుపెట్టారు. ఆందోళన కారుల ఆగ్రహాన్ని తట్టుకోలేక నేపాల్ అధ్యక్షుడు రాంచంద్ర పౌడ్యాల్, ప్ర ధానమంత్రి కెపి శర్మ ఓలీ […]

ఫార్ములా ఈకార్‌రేసు నిందితులపై త్వరలో ఛార్జిషీట్

మన తెలంగాణ/హైదరాబాద్: ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం చోటు చే సుకుంది. ప్రభుత్వానికి ఎసిబి అధికారులు నివేదిక సమర్పించారు. దీంతో ప్రభుత్వం ఏ నిర్ణ యం తీసుకుంటుందన్న దానిపై ఉత్కంఠ రేపుతుంది. ఫార్ములా ఈ కారు రేసుకు సంబంధిం చి ఎసిబి సుదీర్ఘకాలం విచారించింది. బిఆర్‌ఎ స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌ను రెండు సార్లు విచారణ చేసింది. ఈ కేసులో విషయాలను గు రించి ఆరా తీసింది. సిఎం ఢిల్లీలో ఉండటంతో బుధవారం […]

విపత్తు నిధులివ్వండి

మన తెలంగాణ/హైదరాబాద్: అనుకోనివిపత్తు తో సర్వం కోల్పోయిన ప్రజలను ఆదుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రానికి వెంటనే నిధులు కేటాయించాలని సిఎం రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు.తెలంగాణ లో భారీ వర్షాల కారణంగా జరిగిన పంట, ఆస్తి నష్టంపై అధికారులు ఇచ్చిన నివేదికను మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి నిర్మాలా సీతారామన్‌కు అందచేశారు. అలాగే తెలంగాణ విద్యారంగంలో సమూల మార్పులు తీసుకురావడానికి తా ము చేస్తున్న కృషికి మద్దతు ఇవ్వాలని కోరారు. తెలంగాణలో సుమారు […]

జూబ్లీహిల్స్ అభ్యర్థి దానం?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దింపాలని ఆ పార్టీ అధిష్ఠానం వ్యూత్మకంగా అడుగులు వేయాలని యోచిస్తోన్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం నుంచి దానం నాగేందర్‌ను గట్టెక్కించడం, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సానుకూల వాతావరణ ఉందనే సంకేతాన్ని పంపించాలనే ద్విముఖ వ్యూహంతో ఉన్నట్టు ఈ వర్గాల సమాచారం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రధాన […]

సిఎం రేవంత్ రెడ్డి గోబెల్స్‌ను మించిపోయారు:హరీష్ రావు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. గోబెల్స్‌ను మించిపోయారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ, మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి మాటలు వింటే అబద్ధాలు సైతం ఆత్మహత్య చేసుకుంటాయన్నారు. మూసీకి ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ నీళ్లు వస్తున్నాయని రేవంత్ పచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. కెసిఆర్ కట్టిన కాళేశ్వరం నీళ్లతోనే సిఎం రేవంత్ రెడ్డి.. మూసీ ప్రాజెక్టును చేపట్టారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజక్టులో భాగంగానే మల్లన్నసాగర్‌కు నీళ్లు వస్తున్నాయన్నారు తెలిపారు. కెసిఆర్ నిర్మించిన మల్లన్నసాగర్ హైదరాబాద్‌కు వరంగా మారిందని స్పష్టం … Read more

కెటిఆర్‌కు నీటిపారుదలపై అవగాహన లేదు:మంత్రి వివేక్ వెంకటస్వామి

మల్లన్నసాగర్‌కు ఎల్లంపల్లి నుంచే నీళ్లోస్తాయని, కెటిఆర్‌కు నీటి పారుదలపై అవగాహన లేదని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ఒక ఫెయిల్డ్ ప్రాజెక్టు అని తాను గతం లోనే చెప్పినట్లు గుర్తు చేశారు. మల్లన్నసాగర్ ఒక పెద్ద కుంభకోణమని అన్నారు. కెసిఆర్ కోసమే కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ నిర్మించా రని ఆరోపించారు. సిఎం రేవంత్‌రెడ్డి భూమి పూజ చేసింది ఒరిజినల్ ప్రాజెక్టు అని చెప్పారు. కెటిఆర్ … Read more