ఆ విషయాన్ని పట్టించుకోని ఐసిసి… పాక్‌కి బుద్ధి వచ్చేలా..

Pakistan

దుబాయ్: ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్థాన్‌ల (Pakistan) మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో జరిగిన ఓ సంఘటన తీవ్ర వివాదానికి తెర తీసింది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు పాకిస్థాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. దీనిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. మ్యాచ్ రెఫరీని ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలంటూ, అంతర్జాతీయ క్రికెట్ సంఘం, […]

ఎకో టూరిజంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి: చంద్రబాబు

introduced greening cleanliness program

అమరావతి: మొదటి సారి సింగపూర్ వెళ్లి అక్కడ పచ్చదనం- పరిశుభ్రతపై పరిస్థితిని అధ్యయనం చేశానని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పొరుగుసేవల సిబ్బందిని నియమించడం కూడా అదే తొలిసారి అన్నారు. సిఎం అధ్యక్షతలో రెండో రోజు కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. హైదరాబాద్ లో నైట్ క్లీనింగ్ ప్రారంభించామని, పచ్చదనం- పరిశుభ్రత కార్యక్రమం తీసుకొచ్చామని తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీ  స్వచ్ఛభారత్ రిపోర్టు తానే ఇచ్చానని, స్వచ్ఛత అంటే శుభ్రతే కాదని […]

ఆ నిర్ణయం సరికాదు.. ‘మా ఐన్‌స్టీన్’ అంటూ అక్తర్ అసహనం..

Shoaib Akhtar

ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఎన్నో టెన్షన్‌ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ సునాయాసంగా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో పాకిస్థాన్ జట్టుపై ఆ దేశ అభిమానులు, మాజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్ కెప్టెన్ సల్మా అలీ అఘా టాస్ సమయంలో తీసుకున్న నిర్ణయాన్ని మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) తప్పుబట్టారు. టీం ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో టాస్ […]

రైతులను పట్టించుకోని కూటమి సర్కార్ పై జగన్ ఆగ్రహం

jagan fire chandra babu

అమరావతి: ఎపి సిఎం చంద్రబాబూ పంటలకు ధరల పతనంలో తమ రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావని మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలేనానని రూపాయిన్నరకే కిలో టమోటానా..ఇవేం ధరలు? అని ప్రశ్నించారు. రైతులను పట్టించుకోని చంద్రబాబు సర్కార్ పై జగన్ఆ గ్రహం వ్యక్తం చేశారు.   రైతు బతకొద్దా? అని కొన్ని వారాలుగా రైతులు లబోదిబోమంటున్నారని తమరు కనికరం కూడా చూపడం లేదు కదా? అని విమర్శించారు. ఉల్లి, […]

నాలాలో మిస్సింగ్.. ఇంకా దొరకని ఆచూకీ.. కుటుంబసభ్యుల ఆగ్రహం

Hyderabad

హైదరాబాద్: కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు నగరాన్ని (Hyderabad) అతలాకుతలం చేశాయి. మూడు రోజుల క్రితం భారీ వర్షం కురియడంతో పలు ప్రాంతాల్లో రోడ్లన్ని జలమయమయ్యయి. ఈ క్రమంలో వాహనదారుడు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకున్నారు. అయితే అఫ్జల్‌సాగర్, వినోబానగర్‌లో ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా నాలాలు ఉప్పొంగాయి. ఈ క్రమంలో నాలాల్లో ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోయారు. గల్లంతైన అర్జున్, రాము, దినేష్‌లుగా గుర్తించారు. అయిుతే గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. డిఆర్ఎఫ్, […]

ఇంటి ముందు కాల్పులు.. దిశా పటానీకి హామీ ఇచ్చిన సిఎం

Disha Patani

లక్నో: ఇటీవల నటి దిశా పటానీ (Disha Patani) ఇంటి ముందు కాల్పుల ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ విషయంలో నటి కుటుంబానికి ఉత్తర్‌ప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాథ్ హామీ ఇచ్చారు. కాల్పుల ఘటనపై సిఎం ఆరా తీశారు. దిశా తండ్రికి సిఎం ఫోన్ చేసి కాల్పులకు పాల్పడిన వారిని కచ్చితంగా పట్టుకుంటామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని దిశా తండ్రి జగదీష్ వెల్లడించారు. ‘‘యోగి ఆదిత్యనాథ్ మాకు ఫోన్ చేశారు. మా కుటుంబానికి […]

సర్పంచ్‌లకే పవర్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రమంతటా ఎ ల్‌ఈడీ వీధి దీపాలపై పక్కాగా పర్యవేక్షణ ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాల్లో వీధి దీపాల ఏ ర్పాటు, వాటి నిర్వహణ బాధ్యతలను సర్పంచ్‌లకే అప్పగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రా మాల్లో అవసరమైన కొత్త ఎల్‌ఈడీ లైట్లను అమర్చటంతో పాటు వాటిని సమర్థంగా నిర్వహించే నిర్వహణ అధికారం గ్రామ పంచాయతీల పరిధిలోనే ఉండాలని ఆయన స్పష్టం చేశారు. గ్రామా ల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎల్‌ఈడీ […]

ఫీజుల చర్చలు సఫలం

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో ప్ర భుత్వం చర్చలు సఫలమయ్యాయి. దీపావళిలోగా రూ.1200 కోట్ల బకాయిలు విడుదల చేసేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందులో ప్రస్తుతం రూ.600 కోట్ల బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీపావళికి మరో రూ.600 కోట్లు విడుదల చేస్తామని తెలిపింది. దీంతో మంగళవారం ప్రైవేట్ కాలేజీలు యథావిధిగా కొనసాగనున్నాయి. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలలో ప్రభుత్వ తీరును నిరసి స్తూ వృత్తి విద్య సహా డిగ్రీ, కాలేజీలు […]

దులీప్ ట్రోఫీ 2025 విజేత సెంట్రల్ జోన్

బెంగళూరు: ప్రతిష్టాత్మకమైన దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ విజేతగా నిలిచింది. సౌత్ జోన్‌తో జరిగిన ఫైనల్లో సెంట్రల్ ఆరు వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. 66 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సెంట్రల్ జోన్ నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. సౌత్ జోన్ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేయడంతో సెంట్రల్ ఈ మాత్రం స్కోరును అందుకోవడానికి కూడా తీవ్రం శ్రమించాల్సి వచ్చింది. గుర్జాప్‌నీత్ సింగ్, అంకిత్ శర్మలు అద్భుత బౌలింగ్‌తో సెంట్రల్ జోన్ […]

వక్ఫ్‌పై పాక్షిక స్టే

న్యూఢిల్లీ : అత్యంత కీలకమైన వక్ఫ్ సవరణల చ ట్టం 2025పై సుప్రీంకోర్టు సో మవారం తమ ఆ దేశాలతో కూడిన రూలింగ్ వెలువరించింది. చ ట్టంలోని కొన్ని ప్రధాన నిబంధనలపై స్టే విధించింది. అయితే మొత్తం చట్టాన్ని నిలిపివేయాలనే వాదనను తోసిపుచ్చింది. ప్రత్యేకించి వక్ఫ్ ఆస్తుల విషయంలో రూలింగ్ ప్రధానమైంది. దీని మేరకు ఆస్తులకు సంబంధించి నియుక్త అధికారి ఆస్తులపై నివేదిక ఇచ్చేంత వరకూ ఆయా ఆ స్తులు వక్ఫ్ ఆస్తులుగా చలామణిలోకి రావని తే […]