అటవీ సిబ్బందికి పోలీసుల ప్రయోజనాలు

మన తెలంగాణ/రాజేంద్రనగర్ : పోలీసులకు అందే ప్రయోజనాలన్నీ అటవీ సిబ్బందికి వర్తింపజేస్తామని రాష్ట్ర అటవీ శాఖ శాఖ మంత్రి కొం డా సురేఖ అన్నారు. అటవీ సంపద పరిరక్షణలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చా రు. ఇకపై ప్రతిభావంతులైన ఫ్రంట్‌లైన్ అధికారులకు ఏటా రూ. 10 వే లు నగదు పురస్కారం అందిస్తామని మంత్రి ప్రకటించారు. అటవీ సంపదను దోచుకునే స్మగ్లర్లు, అరాచక ముఠాలకు ఎదురొడ్డి ప్రాణాలర్పిం చిన అమరుల త్యాగాలు వృధా కానివ్వకుండా, వారి […]

గొర్రెల స్కామ్‌లో బాధితులకు ఇడి నోటీసులు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన గొర్రెల స్కామ్ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. గొర్రెల స్కామ్ కేసులో బాధితులకు ఇడి నోటీసులు ఇచ్చింది. ఈనెల 15న ఇడి కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఎపికి చెందిన రైతుల నుంచి గొర్రెలు కొనుగోలు చేసి వారికి దళారి వ్యాపారి మొయినుద్దీన్ డబ్బులు చెల్లించలేదు. రైతులకు చెల్లించాల్సిన డబ్బును బినామీ ఖాతాలకు మొయినుద్దీన్ బదిలీ చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. అధికారులు, బ్రోకర్లు కుమ్మక్కై […]

దేశానికి సీడ్‌హబ్

 దేశ అవసరాల్లో తెలంగాణ నుంచే 60శాతం సరఫరా 20 దేశాలకు విత్తనాల ఎగుమతి ఇండో, ఆఫ్రికన్ సీడ్ సమ్మిట్‌లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మన తెలంగాణ/హైదరాబాద్ : దేశానికి సీడ్ హబ్ గా రాష్ట్రం నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఇండియా, ఆఫ్రికా సీడ్ సమ్మిట్ 2025లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ అవసరాల్లో 60 శాతం విత్తనాలను […]

ఉత్తరాఖండ్‌కు ప్రధాని మోడీ రూ.1200 కోట్ల సాయం

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లో వరద బాధిత ప్రాంతాలకు విపత్తు సాయంగా రూ. 1200 కోట్లు ప్రధాని మోడీ గురువారం ప్రకటించారు. వైపరీత్యాల వల్ల మృతులైన వారి కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ. 50 వేలు వంతున ప్రకటించారు. అనాథలైన పిల్లలకు పిఎం కేర్స్ పథకం కింద సాయం చేస్తామన్నారు. బాధిత కుటుంబాలను కలుసుకుని పరామర్శించారు. విపత్తులో క్షేత్రస్థాయిలో బాధితులకు సహాయం అందించిన ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, సిబ్బందిని, వాలంటీర్లను అభినందించారు. బాధితుల పునరావాసానికి కేంద్ర […]

బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనలో తెలంగాణ దేశానికి ఆదర్శం:మంత్రి పొంగులేటి

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలబడుతుందని రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాలు, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్ది అన్నారు. గురువారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలోని తన నివాసంలో ఈనెల 15న కామారెడ్డిలో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లపై మంత్రులు సీతక్క, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి, ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, […]

మోహన్ భగవత్‌కు 75 ఏండ్లు.. ప్రత్యేక వ్యాసంతో మోడీ విషెస్

న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రధాన సంచాలకులు మోహన్ భగవత్ గురువారంతో తమ 75వ సంవత్సరంలోకి ప్రవేశించారు. అత్యంత ప్రధానమైన ఈ హిందూత్వ సంస్థ సారధ్య బాధ్యతల్లో ఉన్న భగవత్‌కు ప్రధాని నరేంద్ర మోడీ , అధికార ఎన్‌డిఎ భాగస్వామ్యపక్షాల నేతలు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. సర్‌సంఘ్‌చాలక్‌గా ఆర్‌ఎస్‌ఎస్ సారధ్య బాధ్యతల్లోని వారిని వ్యవహరిస్తారు. ఆయన నాయకత్వ పటిమను ప్రధాని మోడీ ప్రశంసించారు. ప్రత్యేకంగా ఆయన కార్యదక్షతను కొనియాడుతూ ప్రధాని పేరిట వెలువడ్డ వ్యాసం […]

నేపాల్ జైలులో 8 మంది ఖైదీల మృతి..15 వేల మంది పరారీ

ఖాట్మండూ: నేపాల్‌లో జెన్‌జెడ్ ఉద్యమకారులు చేపట్టిన ఆందోళనలను ఆసరా చేసుకొని జైళ్ల నుంచి ఖైదీలు పరారవుతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం మాదేష్ ప్రావిన్స్‌లో రమేచాప్ జిల్లా జైలు గోడలను గ్యాస్ సిలిండర్‌తో పేల్చి పరారవ్వడానికి ప్రయత్నించిన ఖైదీలను నివారించడానికి భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఖైదీల మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది.13 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని రమేచాప్ జిల్లా ఆస్పత్రికి చికిత్స కోసం […]

క్రికెట్ మ్యాచే కదా.. జరగనివ్వండి: భారత్-పాక్ పోరుపై సుప్రీం

న్యూఢిల్లీ : ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ రద్దుకు దాఖలైన పిటిషన్ తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనిపై అత్యవసరంగా విచారణ తేదీ ఖరారు చేయాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం పిటిషనర్ తరఫు న్యాయవాదికి తెలిపింది. ఎందుకింత తొందర అని ప్రశ్నించారు. న్యాయమూర్తులు జెకె మహేశ్వరి, విజయ్ బిష్ణోవ్‌తో కూడిన ధర్మాసనం ముందు విచారణకు పిటిషన్ వచ్చింది. 2025 ఆపియా కప్ లో భాగంగా ఈ నెల 14వ తేదీన దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ […]

‘మిరాయ్’లో రెండు సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి.. థ్రిల్ అవుతారు: తేజ

సూపర్ హీరో తేజ సజ్జా పాన్ ఇండియా విజువల్ వండర్ ‘మిరాయ్’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. రితికా నాయక్ హీరోయిన్ గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. శుక్రవారం ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా హీరో తేజ సజ్జా మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన […]

‘ట్రాన్స్‌ ఆఫ్‌ ఓమి’.. #OG విలన్‌ పవర్‌ఫుల్‌ సాంగ్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజీ మూవీ ‘ఓజి’ నుంచి మరో పవర్‌ఫుల్‌ సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. పవర్‌ఫుల్‌ ‘ఓమి’ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే పవన్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఓమి క్యారెక్టర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘ట్రాన్స్ ఆఫ్ ఓమి’ పేరుతో సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. అద్వితీయ […]