మణిపూర్ శాంతి సౌభాగ్యాలతో విలసిల్లేలా చేస్తాం: ప్రధాని మోడీ

చురాచంద్‌పూర్ : మణిపూర్‌ను పేరుకు తగ్గట్లుగానే శాంతి, సౌభాగ్యాలకు ప్రతీకగా నిలపాలనేదే తమ ఆలోచన అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. 2023 మే నెలలో తెగల మధ్య సంకుల సమరంతో అతలాకుతలం అయిన ఈ అత్యంత కీలకమైన ఈశాన్య రాష్ట్రంలో ప్రధాని మోడీ ఇక్కడ పర్యటించడం రెండేళ్లలో ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ఆయన కుకీ తెగలు ఎక్కువగా ఉండే చురాచంద్‌పూర్‌లో శనివారం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఘర్షణలతో తల్లడిల్లిన ఈ నేల సుభిక్షం […]

పది టిఎంసిల నీటిని ఏపి మళ్లీస్తోంది: సిఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy

ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని ముఖ్యమంత్రి అన్నారు. గడిచిన పదేళ్లలో అధికారంలో ఉన్న కెసిఆర్ ప్రభుత్వం కృష్ణా జలాల్లో న్యాయపరంగా రావాల్సిన నీటి కోటా సాధించటంలో దారుణంగా విఫలమైందన్నారు. కృష్ణాపై తలపెట్టిన పాలమూరు నుంచి డిండి వరకు ప్రాజెక్టు లను పెండింగ్‌లో పెట్టిందని, నీటి వాటాల విషయంలో తీరని ద్రోహం చేసిందన్నారు. దిగువ రాష్ట్రాల హక్కులతో పాటు నదీ వాటాల పంపిణీ న్యాయ సూత్రాల ప్రకారం కొత్తగా […]

మహిళలు, చిన్నారుల భద్రతకు త్వరలో నూతన విధానం:మంత్రి సీతక్క

ఈ నెల 22న మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, ఉన్నతాధికారులతో మహిళా సదస్సు నిర్వహించి వారి అభిప్రాయాల ఆధారంగా కొత్త మహిళా భద్రతా విధానాన్ని తీసుకురాబోతున్నామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. ముఖ్యంగా చిన్నారుల రక్షణను తమ ప్రభుత్వం ప్రధాన బాధ్యతగా భావిస్తోందని స్పష్టం చేశారు. పిల్లలు అంటే మన భవిష్యత్తు అని, వారి రక్షణ అంటే మన భవిష్యత్తు రక్షణగా మంత్రి పేర్కొన్నారు. నగరంలోని ఒక హోటల్ ప్రాంగణంలో సిఐఐ, యంగ్ ఇండియన్స్ […]

గూప్-1 పరీక్ష అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: హరీష్ రావు

హైకోర్టు మొట్టికాయలు వేసినా రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదు  గ్రూప్-1 ఉద్యోగానికి మంత్రులు, అధికారులు రూ.లక్షల్లో లంచం డిమాండ్  ఈ విషయం  నిరుద్యోగ యువకులే చెబుతున్నారు  రాష్ట్ర యువతను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్  కాంగ్రెస్ ప్రభుత్వానిది జాబ్ క్యాలెండర్ కాదు..జాబ్‌లెస్ క్యాలెండర్  కెసిఆర్ భర్తీ చేసిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చిన సర్కార్  కాంగ్రెస్ ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి  మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ తన్నీరు హరీశ్‌రావు మన తెలంగాణ/సిద్దిపేట […]

మహిళా స్వయం సంఘాలకు దసరా జోష్

రానున్న దసరా పండుగకు మహిళా సంఘాల్లో జోష్ నింపేందుకు ప్రతి సభ్యురాలికి చీరలు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగకు పంపిణీ చేసిన చీరల్లో నాణ్యత లేదని పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. తక్కువ ధర ఉన్న, ఏ మాత్రం నాణ్యత లేని చీరలను పంపిణీ చేశారని విమర్శలు వెల్లువెత్తాయి. అదీ గుజరాత్‌లోని సూరత్ నుంచి తీసుకువచ్చి కోటి మంది మహిళలకు ఆనాటి బిఆర్‌ఎస్ సర్కార్ చీరలు […]

మహోధృత ఉద్యమ రూపం సకల జనుల సమ్మె:కెటిఆర్

KTR

తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష ఎంత బలంగా ఉందో చాటి చెప్పిన మహోధృత ఉద్యమ రూపం సకల జనుల సమ్మె అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యానించారు. సబ్బండ వర్గాల ప్రజలు ఏకమై, 42 రోజుల పాటు శాంతియుతంగా నిరసన తెలిపి, తెలంగాణ సెగను ఢిల్లీకి తాకేలా చేసిన మహోన్నత ఘట్టం సకల జనుల సమ్మె అని పేర్కొన్నారు. 2011 సెప్టెంబర్ 12 రోజున కరీంనగర్ జనగర్జనలో ఉద్యమ సారథి కెసిఆర్ పిలుపు మేరకు యావత్ […]

అలా చేస్తే.. పిల్లలు, తల్లిదండ్రుల్లో భయం పెరుగుతుంది: సాయి దుర్గ తేజ్

Sai Durgha Tej

హైదరాబాద్: సోషల్‌మీడియా వాడకం పెరిగినప్పటి నుంచి చిన్నా, పెద్ద తేడా లేకుండా దానికి అడిక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా కొంతమంది టీనేజ్‌లో ఉన్న పిల్లలు ఇన్‌స్టా, ఎక్స్‌ల వల్ల చెడు కంటెంట్‌ చూసి.. తప్పుదారి పడుతున్నారు. అయితే ఈ సమస్యకు పరిష్కారం జరగాలంటే.. చిన్న పిల్లల ఎక్స్, ఇన్‌స్టా ఖాతాలను ఆధార్ కార్డు నెంబర్‌ల కోసం అనుసంధానం చేయాలని హీరో సాయి దుర్గా తేజ్ (Sai Durgha Tej) అభిప్రాయపడ్డారు. అభయం మసూమ్-25లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు […]

మూడేళ్ల తర్వాత.. ఒటిటిలోకి వస్తున్న సినిమా..

Aha

హైదరాబాద్: ఈ మధ్యకాలంలో రిలీజ్‌ అయినా వారం లేదా రెండు వారాల్లో సినిమాలు ఒటిటిలోకి వచ్చేస్తున్నాయి. మరికొన్ని సినిమాలు అయితే.. నెల రోజుల వ్యవధిలో బుల్లితెరపై సందడి చేస్తాయి. కానీ, ఓ సినిమా మాత్రం ఏకంగా మూడేళ్ల తర్వాత ఒటిటిలోకి (AHA) వస్తోంది. ఆ సినిమాలో ఓ విశేషం కూడా ఉంది. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ఈ సినిమాలో విలన్‌‌గా నటించారు. ఆ సినిమా పేరు ‘పగ పగ పగ’. 2022 సెప్టెంబర్ 22న ఈ […]

మా వేదనను అప్పుడే మర్చిపోయారా.. పహల్గాం బాధితురాలి ఆగ్రహం

Ind VS Pak

ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్ జరుగనుంది. అయితే పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌తో భారత్ మ్యాచ్ (Ind VS Pak) ఆడవద్దు అంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. చివరకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మ్యాచ్ ఆడుతామని బిసిసిఐ ప్రకటించింది. ఈ విషయాన్ని ఐసిసితో పాటు, ఎసిసి కూడా అంగీకరించాయి. అయితే పహల్గాం దాడి బాధితురాలు ఐషాన్య ద్వివేది ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు క్రికెటర్లకు ఈ మ్యాచ్ […]

రాహుల్ పై మాట్లాడే అర్హత కెటిఆర్ కు ఉందా?: మహేష్ గౌడ్

Mahesh Goud comments KTR

హైదరాబాద్: ఓట్ చోరీ గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధారాలతో నిరూపించారని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేల గురించి రాహుల్ ఎందుకు మాట్లాడాలి?అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం సిబి ఐకి అప్పజెప్పినా కేంద్రంలో ఎందుకు కదలిక లేదు? అని ఫార్ములా- ఈ కార్ రేసు కేసులో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కు జైలు ఖాయం అని అన్నారు. ఢిల్లీలో బిఆర్ఎస్ […]