రైళ్లో నుంచి కిందపడి హీరోయిన్‌కు గాయాలు

Karishma sharma injured

ముంబయి: కదులుతున్న లోకల్ రైలు నుంచి దూకడంతో కిందపడి కరిష్మా శర్మ గాయపడ్డారు. దీనికి సంబంధించిన పోస్టును తన ఇన్‌స్టా గ్రామ్‌లో తెలియజేశారు. షూటింగ్ కోసం చీరలో బయలుదేరాను, ముంబయి లోకల్ రైలు ఎక్కగానే అది వేగంగా కదిలింది, అప్పటికీ తన స్నేహితులు రైలు ఎక్కకపోవడంతో తనలో ఆందోళన మొదలైంది, వెంటనే రైలు నుంచి కిందకు దూకింది. ఈ క్రమంలో కిందపడిపోవడంతో తలతో పాటు వీపు భాగంలో గాయాలయ్యాయి. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీపు […]

హాలీవుడ్ స్థాయిలో ‘కిష్కింధపురి’..

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన మిస్టీరియస్ థ్రిల్లర్ ’కిష్కింధపురి’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దర్శకులు అనిల్ రావిపూడి, బుచ్చిబాబు సాన, నిర్మాత సుస్మిత కొణిదెల ముఖ్య అతిధులుగా హాజరైన ఈ ప్రీరిలీజ్ వేడుకచాలా గ్రాండ్ గా జరిగింది. ప్రీరిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ అనిల్ […]

‘మిరాయ్’లో రెండు సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి.. థ్రిల్ అవుతారు: తేజ

సూపర్ హీరో తేజ సజ్జా పాన్ ఇండియా విజువల్ వండర్ ‘మిరాయ్’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. రితికా నాయక్ హీరోయిన్ గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. శుక్రవారం ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా హీరో తేజ సజ్జా మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన […]

‘ట్రాన్స్‌ ఆఫ్‌ ఓమి’.. #OG విలన్‌ పవర్‌ఫుల్‌ సాంగ్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజీ మూవీ ‘ఓజి’ నుంచి మరో పవర్‌ఫుల్‌ సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. పవర్‌ఫుల్‌ ‘ఓమి’ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే పవన్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఓమి క్యారెక్టర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘ట్రాన్స్ ఆఫ్ ఓమి’ పేరుతో సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. అద్వితీయ […]

రూ.1000 కోట్లు సినిమాలు లేవు కానీ… ఆ వ్యాధి నాకు ఎంతో నేర్పింది: సమంతా

Samantha comments on Myositis

ఢిల్లీ: ప్రతి శుక్రవారం వచ్చిందంటే చాలు తనలో భయాందోళనలు ఉండేవని హీరోయిన్ సమంత తెలిపారు. తన స్థానాన్ని ఎవరో ఒకరు భర్తీ చేస్తారని, శుక్రవారం బాక్సాఫీసు నంబర్లు లెక్కపెట్టుకుంటూ ఉండేదానని వివరించారు. మయో సైటిస్ తనకు ఎన్నో నేర్పడంతో పాటు తనలో పెనుమార్పులు తీసుకొచ్చిందన్నారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో సమంతా మాట్లాడారు. ఒకే సంవత్సరంలో ఐదు సినిమాలు విడదలైన సందర్భాలు ఉన్నాయని, ఇదే విజయమని అనుకున్నానని పేర్కొన్నారు. విరామం లేకుండా సినిమాలు చేయడం అని నమ్మేదానని, […]

స్టార్ల సందడి

హైదరాబాద్ ఫిల్మ్ స్టూడియోలో ఇద్దరు పవర్‌హౌస్ స్టార్‌లు కలుసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కలుసుకున్న సందర్భం రెండు యూనిట్లకూ ఎనర్జీని నింపింది. చిరంజీవి ప్రస్తుతం హైదరాబాద్‌లో అని ల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకరవర ప్రసాద్ కోసం ఒక కలర్ ఫుల్ పాట చిత్రీకరణలో ఉన్నారు. మెగాస్టార్, నయనతారలపై ఈ సాంగ్ షూట్ చేస్తున్నారు. అదే కాంప్లెక్స్‌లోని సమీపంలోని విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ కలిసి చేస్తున్న మూవీ షూటింగ్ జరుగుతోంది. ఇందులో […]

హిమాలయాల్లోని సన్యాసిగా కనిపిస్తా

సూపర్ హీరో తేజ సజ్జా నటించిన పాన్-ఇండియా విజువల్ వండర్ ‘మిరాయ్’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనో జ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. రితికా నాయక్ హీరోయిన్ గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. శుక్రవారం ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా రితికా నాయక్ మీడియాతో మాట్లాడుతూ “ఈ సినిమాలో […]

దసరా కానుకగా ‘వాయుపుత్ర’

గొప్ప యోధుడైన హనుమంతుడు కథతో ‘వాయుపుత్ర’ చిత్రం రూపొందుతోంది. ఇది పర్వతాలను కదిలించిన భక్తి కథ కూడా. ఇది తరాలను తీర్చిదిద్దిన, ప్రేరేపించిన హనుమంతుడి అచంచల విశ్వాసాన్ని సంగ్రహిస్తుంది. చందూ మొండేటి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకర ప్రొడక్షన్స్ సమర్పకులుగా వ్యవహరిస్తోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. భారీస్థాయిలో 3డి యానిమేషన్ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ’వాయుపుత్ర’, హనుమంతుని కాలాతీత కథను గొప్ప దృశ్యకావ్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. […]

జైల్లో దర్శన్ బాధలు.. కీలక ఆదేశాలు ఇచ్చిన కోర్టు

Darshan

బెంగళూరు: రేణుకస్వామి హత్య కేసులో పరప్పన అగ్రహార జైలులో శిక్ష కన్నడ నటుడు దర్శన్ (Actor Darshan) తన బాధలు వీడియో కాన్ఫరెన్స్‌లో జడ్జితో తన బాధలు చెప్పుకున్న విషయం తెలిసిందే. జైలులో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని.. తను ఇక్కడ ఉండలేనని.. ఇంత విషమివ్వాలని దర్శన్ జడ్జిని కోరాడు. దీనిపై బెంగళూరు కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అతనికి జైలులో ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని జైలు అధికారులను ఆదేశించింది. అదే సమయంలో దర్శన్‌ను పరప్పన […]

దుల్కర్‌ కు జోడీగా పూజా హెగ్డే.. వీడియో రిలీజ్

మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌ టాలీవుడ్ లో తన జోరు చూపిస్తున్నాడు. తెలుగులో దుల్కర్ చేసిన ‘మహానటి’, ‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా మరో తెలుగు మూవీ చేస్తున్నాడు. DQ41 రూపొందుతున్న ఈ సినిమాలో దుల్కర్ కు జోడీగా అందాల తార పూజాహెగ్డే నటిస్తోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ బుధవారం మేకర్స్ వీడియోను వదిలారు. ఇందులో దుల్కర్-పూజా మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేలా ఉంది. […]