దయచేసి డబ్బులు పంపకండి.. ఫ్యాన్స్‌కి హీరో విజ్ఞప్తి

Upendra

కన్నడ సూపర్‌స్టార్ హీరో ఉపేంద్రకు (Upendra) ఊహించని సమస్య ఎదురైంది. ఆయన ఫోన్ హ్యాకింగ్‌కి గురైంది. దీంతో తన ఫోన్‌ నుంచి కాల్స్‌ని ఎవరూ లిఫ్ట్ చేయవద్దని.. తన భార్య ఫోన్ నుంచి కూడా కాల్ చేసి డబ్బులు అడిగితే ఎవరూ పంపవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన సోషల్‌మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశానని.. ఆయన పేర్కొన్నారు. తన భార్య ప్రియాంక ఆర్డర్ చేసిన […]

హృదయాలను హత్తుకునే ‘సఖిరే..’

Shiva Kandukuri hero Chai Wala

శివ కందుకూరి హీరోగా ‘చాయ్ వాలా’ చిత్రాన్ని హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రాధా విజయలక్ష్మి, వెంకట్ ఆర్. పాపుడిప్పు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రమోద్ హర్ష రచన, దర్శకత్వం వహిస్తున్నారు. మేకర్స్ తొలి పాటను విడుదల చేశారు. ‘సఖిరే..’ అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ హృదయాలను హత్తుకుంటోంది. క్యాచీ ట్యూన్‌తో మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ ఆర్.విహారి ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశారు. సురేశ్ బనిశెట్టి రాసిన ఈ పాటను కపిల్ కపిలన్ […]

శ్రీ వేదాక్షర మూవీస్ ద్వారా ‘ఇడ్లీ కొట్టు’

Dhanush fourth movie Iḍlī koṭṭu

కుబేర’తో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకున్న నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ సినిమాతో అలరించబోతున్నారు. ధనుష్ హీరో, డైరెక్టర్‌గా చేస్తున్న ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్, వండర్‌బార్ ఫిలమ్స్ బ్యానర్స్‌పై ఆకాష్ బాస్కరన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. డైరెక్టర్‌గా ధనుష్‌కి ఇది నాలుగో మూవీ. ఈ చిత్రం తెలుగు, తమిళ్‌లో ఒకేసారి అక్టోబర్ 1న రిలీజ్ కానుంది. చాలామంది ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం పోటీ పడ్డారు. ఫైనల్‌గా ధనుష్ కెరీర్‌లోనే […]

‘ది ప్యారడైజ్’లో కీలక పాత్ర..

హిట్: ది థర్డ్ కేస్’తో మంచి విజయం సాధించిన నేచురల్ స్టార్ నాని, ఇప్పుడు తన కెరీర్‌లోనే అతిపెద్ద చిత్రమైన ‘ది ప్యారడైజ్’లో నటిస్తున్నారు. ‘ది ప్యారడైజ్’ సినిమాలో కీలక పాత్రలో మోహన్ బాబు నటిస్తున్నారట. ఆన్ లొకేషన్ స్టిల్స్‌లో కూడా ఆ విషయం బయటపడింది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా మాత్రం ఇంకా ప్రకటించలేదు. తాజాగా మంచు లక్ష్మి ఈ విషయాన్ని ప్రకటించేసింది. ‘ది ప్యారడైజ్’ సినిమాలో నాన్న నటిస్తున్నారని, చాలా ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నారంటూ […]

ఈ నెల చివరలో క్లైమాక్స్ షూటింగ్

యంగ్ హీరో అక్కినేని అఖిల్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘లెనిన్’ చిత్రా న్ని దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి(నందు) డైరెక్షన్‌లో చేస్తున్నాడు. ఇప్పటికే, 80 శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఇప్పటికే మొదలైంది. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్‌ను షూట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్లైమాక్స్ షూట్ పూర్తి అయ్యాక, అఖిల్ తన పాత్రకు డబ్బింగ్‌ను కూడా పూర్తి చేస్తారట. ఈ క్లైమాక్స్ షూట్‌ను ఈ నెల […]

నటి కాకపోతే.. స్టైలిస్ట్ లేదా మోడల్ అయ్యేదాన్ని

కెరీర్ ఆరంభమే మహానటి లాంటి బయోపిక్ చిత్రంలో లెజెండరీ సావిత్రి పాత్ర లో అద్భుతంగా నటించి మెప్పించిన కీర్తి సురేశ్‌కి జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కింది. ఆ తర్వాత టాలీవుడ్‌లో యువహీరోల సరసన నటిస్తూనే, అగ్ర హీరోల సినిమాల్లోనూ అవకాశం అందుకుంది. చూస్తుండగానే దశాబ్ధం కెరీర్ రన్ పూర్తి చేసింది. పన్నెండేళ్లుగా ఈ బ్యూటీ సినీరంగంలో కథానాయికగా రాణించడం అంటే అంత సులువు కాదు. కానీ కీర్తి ఉత్తమ నటిగా నిరూపించుకుంటూ కెరీర్‌ని ముందుకు నడిపిస్తోంది. […]

హీరోయిన్ ఊర్వశి రౌటేలాకు ఇడి నోటీసులు..

హైదరాబాద్: బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌ కేసులో ఇడి అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో దర్యాప్తు మరింత వేగవంతం చేశారు. ఇందులో భాగంగా నిందితులుగా ఉన్న మాజీ ఎంపి మిమి చక్రవర్తికి, నటి ఊర్వశి రౌటేలాకు ఆదివారం ఇడి నోటీసులు జారీ చేసింది. ఈనెల 15న విచారణకు రావాలని మిమి చక్రవర్తికి సమన్లు పంపింది. ఇక, ఊర్వశి రౌటేలాను ఈ నెల16న విచారణకు హాజరుకావాల్సింది నోటీసుల్లో పేర్కొంది. కాగా, బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసినందుకు సినీ సెలబ్రెటీలు […]

‘మిరాయ్’ సూపర్‌హిట్.. మెగాస్టార్‌తో వర్కింగ్ ఛాన్స్‌ కొట్టేసిన కార్తీక్

Karthik Ghattamaneni

తేజా సజ్జా, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మిరాయ్’. రితిక నాయక్ ఈ సినిమాలో హీరోయిన్. సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ టాక్‌ను సంపాదించుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబడుతోంది. అయితే ఈ సినిమాతో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని (Karthik Gattamaneni) పాన్ ఇండియా రేంజ్‌లో పాపులర్ అయిపోయాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవితో కార్తీక్ ఛాన్స్ కొట్టేశాడు. అయితే అది దర్శకుడిగా కాదు. వాల్తేరు వీరయ్య సినిమా […]

ప్రొఫెషనలిజంలో తమన్నా అదుర్స్

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తెలుగు, తమిళ, హిందీ భాషలలో నటిస్తూ అదే స్టార్‌డమ్‌ను కొనసాగిస్తోంది. హీరోయిన్‌గానే కాకుండా ఐటమ్ సాంగ్స్ ద్వారా తన క్రేజ్‌ను మరింత పెంచుకుంటోంది. జైలర్, స్త్రీ 2, రైడ్ 2 సినిమాలలో ఆమె చేసిన స్పెషల్ సాంగ్స్ కుర్రకారును ఊపేశాయి. వర్క్ విషయంలో ఆమె కమిట్ మెంట్ మాములుగా ఉండదు. ఒప్పుకున్న సినిమా కోసం, యాడ్ కోసం, వెబ్ డ్రామా కోసం ఎన్ని రోజులైనా ప్రమోట్ చేస్తుంది. ఏ ఈవెంట్‌కైనా వెళ్తుంది. […]

ట్రైలర్, మొదటి పాట వచ్చేస్తున్నాయి..

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్’ సినిమా అప్‌డేట్స్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్స్ ఇచ్చాడు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ట్రైలర్ రిలీజ్, సాంగ్ రిలీజ్ లాంటివన్నీ చెప్పుకొచ్చాడు. ‘రాజాసాబ్’ ట్రైలర్ సిద్ధమైందని ప్రకటించిన ఈ నిర్మాత.. ‘కాంతర- 2’ రిలీజ్ సందర్భంగా ఆ సినిమా ప్రదర్శితమయ్యే థియేటర్లలో ‘రాజాసాబ్’ ట్రైలర్‌ను కూడా ప్రదర్శిస్తామని ప్రకటించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘మిరాయ్’లోని విజువల్ ఎఫెక్ట్‌కి మంచి […]