కొడంగల్‌లో అంగన్‌వాడీల మెరుపు ధర్నా
ప్రీప్రైమరీ వ్యవస్థతో అంగన్‌వాడీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమవుతుందని, ప్రీప్రైమరీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అంగన్‌వాడీ కార్యకర్తలు వికారాబాద్ జిల్లా, కొడంగల్‌లో కదం తొక్కారు. కొడంగల్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటి ముందు భారీ ఎత్తున అంగన్‌వాడీ కార్యకర్తలు గుమికూడి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. సిఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో ధర్నా నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. ఒక దశలో పోలీసులపై […]