రాబోయే సింగరేణి ఎన్నికల్లో హెచ్‌ఎంఎస్ జెండా ఎగురబోతోంది

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో అవినీతి రాజ్యమేలుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. సింగరేణిలో జరుగుతోన్న అవినీతికి వ్యతిరేకంగా హెచ్‌ఎంఎస్ ఆధ్వర్యంలో సింగరేణి భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో శుక్రవారం హెచ్‌ఎంఎస్- సింగరేణి జాగృతి సంయుక్త సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కవితను హెచ్‌ఎంఎస్, సింగరేణి జాగృతి నాయకులు ఘనంగా సత్కరించారు. ఇటీవల హెచ్‌ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవిత ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కల్వకుంట్ల […]

రాష్ట్రంలో రెండు రోజుల పాటు అతిభారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంకు తోడు అల్పపీడన ప్రబావంతో రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలో శనివారం రాష్ట్రంలో నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్క భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, […]

జిహెచ్‌ఎంసి, హైడ్రాకు హైకోర్టు నోటీసులు

ఓ స్థల వివాదంలో జిహెచ్‌ఎంసి, హైడ్రాకు హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ సమీపంలో సుమారు రూ. 100 కోట్ల విలువ చేసే రెండు వేల గజాల స్థలాన్ని ఇటీవల కాలంలో హైడ్రా స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో సదరు స్థలం తనదేనంటూ సత్యనారాయణ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది. జిహెచ్‌ఎంసి, హైడ్రా తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఆ స్థలం జిహెచ్‌ంఎసి, హైడ్రాకు చెందినదని కోర్టుకు […]

గిరిజన సంక్షేమ శాఖకు రూ.11 కోట్లు విడుదల

రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖలో వివిధ చెల్లింపుల కింద పెండింగ్‌లో ఉన్న బకాయిలు రూ.11 కోట్లు విడుదల చేశామని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ఈ ఏడాది జూలై, ఆగస్టు- నెలలకు గాను టీజీడబ్ల్యుఆర్‌ఈఐ సొసైటీకి చెందిన కాంట్రాక్టు, ఔట్సోర్స్, పార్ట్ టైైమ్ సిబ్బందికి, సబ్జెక్ట్ అసోసియేట్స్, హెడ్‌ఆఫీస్లో పనిచేస్తున్న సిబ్బందికి, అలాగే స్వీపింగ్, శానిటేషన్, కేటరింగ్ సేవలకు సంబంధించి రెమ్యునరేషన్, సర్వీస్ ఛార్జీలు కింద రూ.11.53 కోట్లు విడుదల […]

కామారెడ్డి కాంగ్రెస్ సభకు వర్షం దెబ్బ

కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న బహిరంగ సభకు వర్షం దెబ్బ పడింది. తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రకటించింది. బిసిలకు అధికారంలోకి వస్తే బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో నిర్వహించిన బహిరంగ సభలో హామీ ఇచ్చింది. అందుకే ‘కామారెడ్డి డిక్లరేషన్’ అనే నామకరణం చేశారు. అయితే రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ చేసిన కృషి, ఎదురైన సవాళ్ళను వివరించేందుకు కామారెడ్డిలో బహిరంగ సభ […]

గ్రూపు 1 పరీక్షను తిరిగి నిర్వహించండి: బూర నర్సయ్య గౌడ్

గ్రూపు 1 పరీక్షను తిరిగి నిర్వహించాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపి బూర నర్సయ్య గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గ్రూపు 1 పరీక్ష, నియామకాలు సరైన విధంగా జరగలేదని ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గ్రూపు 1 నిర్వహించగా, అది కూడా అనేక అవకతవకలు, అవినీతి కారణంగా పరీక్ష రద్దయ్యిందని ఆయన గుర్తు చేశారు. పరీక్షల నిర్వహణ విషయంలో […]

కేబుల్ ఆపరేటర్లకు ప్రత్యామ్నాయం చూపండి:రాంచందర్ రావు

కేబుల్ ఆపరేటర్లకు ప్రత్యామ్నాయం చూపించండి అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. కేబుల్ వైర్లను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహారిస్తున్నదని ఆయన విమర్శించారు. శుక్రవారం అనేక మంది కేబుల్ ఆపరేటర్లు తార్నాకలోని రాంచందర్ రావు నివాసానికి వెళ్ళి ఎదుర్కొంటున్న సమస్యను వివరిస్తూ వినతి పత్రం అందజేశారు. అనంతరం రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపించకుండా కేబుల్ వైర్లను తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. […]

సింగరేణి సంస్థకు కొత్త బొగ్గు బ్లాక్ లు దక్కని పరిస్థితి : భట్టి

opportunities Singareni company

హైదరాబాద్: కీలక ఖనిజాల వెలికితీతలో కూడా కేంద్రం సింగరేణి సంస్థకు అవకాశం కల్పించాలని డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. గ్రీన్ ఎనర్జీలో కూడా సింగరేణి సంస్థ ప్రవేశించిందని, రాగి, బంగారం మైనింగ్ ఏ సంస్థ చేసినా.. సింగరేణికి 37.75 శాతం వాటా దక్కుతుందని అన్నారు. ఈ సందర్భంగా సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాయచూర్, దేవదుర్గ్ బెల్ట్ లో రాగి, బంగారం ఖనిజాల అన్వేషణలో, కర్ణాటకలో రాగి, బంగారం, మైనింగ్ గనుల తవ్వకాల వేలంలో సింగరేణి […]

గ్రూప్-1 అవకతవకలపై బిజెపి కిమ్మనడంలేదు: కెటిఆర్

KTR comments Revanth Reddy

హైదరాబాద్: ఏకంగా గ్రూప్-1 పరీక్షలనే రద్దు చేయాలని హైకోర్టు చెప్పిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి ఎన్ని స్కాములు చేసినా బిజెపి పట్టించుకోవట్లేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్-1 అవకతవకలపై బిజెపి కిమ్మనడంలేదని, పోస్టుల అమ్మకం ఆరోపణలపై బిజెపి మౌనానికి కారణమేంటి? అని కెటిఆర్ ప్రశ్నించారు. తమ హయాంలో ప్రతిదానికీ సిబిఐ విచారణ కావాలని హడావిడి చేశారని, గ్రూప్-1 స్కాంపై బిజెపి నేతలు సిబిఐ విచారణ ఎందుకు […]

ర‌విత్ర‌యం… జంగు సైర‌నూదిరో జైలులో మాయ‌న్న‌లు

Modem Balakrishna

తెలుగు నేలనంతా హోరెత్తించిన “జంగు సైర‌నూదిరో జైలులో మాయ‌న్న‌లు” పాట‌కు స్ఫూర్తినిచ్చిన పోరాటానికి నాయ‌క‌త్వం వ‌హించింది ముగ్గురు విప్ల‌వ కారులు. 90వ ద‌శ‌కంలో అరెస్ట‌యి హైద‌రాబాద్ జైల్లో ఉన్న అప్ప‌టి పీపుల్స్ వార్ నాయ‌కులు చారిత్రాత్మ‌క పోరాటాన్ని నిర్మించారు. “ర‌విత్ర‌యం” (శాఖ‌మూరి అప్పారావు అలియాస్ ర‌వి, ప‌టేల్ సుధాక‌ర్ రెడ్డి అలియాస్ సూర్యం, మోడెం బాల‌కృష్ణ అలియాస్ భాస్క‌ర్) శ‌తృ శిబిరాన్ని కూడా పోరాట కేంద్రంగా ఎలా మ‌ల‌చ‌వ‌చ్చో ఆచ‌ర‌ణ‌లో చూపించారు. త‌మ పోరాటం వ‌ల్ల దేశ […]