జిడిపిలో ఎంఎస్‌ఎంఇ లు పది శాతం వాటా సాధించాలి:మంత్రి శ్రీధర్ బాబు

రాష్ట్ర జిడిపిలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఇ)ల వాటా పది శాతం ఉండేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తమ ప్రభుత్వం ఎంఎస్‌ఎంఇ నూతన పాలసీని రూపొందించినట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. శనివారం నాడు ఆయన శంషాబాద్‌లో ఏర్పాటైన గో-నేషనల్- ఎక్స్ పో 2025 ఐదో ద్వైవార్షిక సదస్సును ప్రారంభించిన సందర్భంగా నిర్వాహకులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు తెలిపారు. దాదాపు 4 వేల మంది పారిశ్రామికవేత్తలు పాల్గొన్న […]

పది టిఎంసిల నీటిని ఏపి మళ్లీస్తోంది: సిఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy

ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని ముఖ్యమంత్రి అన్నారు. గడిచిన పదేళ్లలో అధికారంలో ఉన్న కెసిఆర్ ప్రభుత్వం కృష్ణా జలాల్లో న్యాయపరంగా రావాల్సిన నీటి కోటా సాధించటంలో దారుణంగా విఫలమైందన్నారు. కృష్ణాపై తలపెట్టిన పాలమూరు నుంచి డిండి వరకు ప్రాజెక్టు లను పెండింగ్‌లో పెట్టిందని, నీటి వాటాల విషయంలో తీరని ద్రోహం చేసిందన్నారు. దిగువ రాష్ట్రాల హక్కులతో పాటు నదీ వాటాల పంపిణీ న్యాయ సూత్రాల ప్రకారం కొత్తగా […]

68 జిఓను రద్దు చేసి హోర్డింగ్ ఏజెన్సీల సమస్యలను పరిష్కరించాలి

జిఓ 68ని రద్దు చేసి హోర్డింగ్ ఏజెన్సీల సమస్యలను పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. జిఓ 68 ని రద్దు చేస్తామని, హోర్డింగ్‌లపై అధికార పార్టీ గుత్తాదిపత్యాన్ని తొలగించి వాటిపై ఆధారపడిన కుటుంబాలను రక్షిస్తామని గత జిహెచ్‌ఎంసి ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ హామినిచ్చిందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 21 నెలలు దాటినా […]

ఆయుర్వేద పద్ధతులను, యోగాను అణచి వేసే కుట్ర:మంత్రి కిషన్ రెడ్డి

ప్రస్తుతం బహుళజాతి కంపెనీలు, అలోపతి మందుల కంపెనీలు ఆయుర్వేద వైద్య పద్ధతులను, యోగాను అణచి వేసే ప్రయత్నం చేస్తున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆరోపించారు. యూసుఫ్‌గుడాలోని ఎన్‌ఐఎంఎస్‌ఎంఇ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ ఆయుర్వేదానికి వ్యతిరేకంగా ప్రపంచంలో ఒక లాబీ పని చేస్తున్నదని, ఈ లాబీని తట్టుకుని ఆయుర్వేదానికి ప్రాధాన్యతనివ్వాలంటే మనం సమర్థవంతంగా పని చేస్తూ […]

మహిళలు, చిన్నారుల భద్రతకు త్వరలో నూతన విధానం:మంత్రి సీతక్క

ఈ నెల 22న మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, ఉన్నతాధికారులతో మహిళా సదస్సు నిర్వహించి వారి అభిప్రాయాల ఆధారంగా కొత్త మహిళా భద్రతా విధానాన్ని తీసుకురాబోతున్నామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. ముఖ్యంగా చిన్నారుల రక్షణను తమ ప్రభుత్వం ప్రధాన బాధ్యతగా భావిస్తోందని స్పష్టం చేశారు. పిల్లలు అంటే మన భవిష్యత్తు అని, వారి రక్షణ అంటే మన భవిష్యత్తు రక్షణగా మంత్రి పేర్కొన్నారు. నగరంలోని ఒక హోటల్ ప్రాంగణంలో సిఐఐ, యంగ్ ఇండియన్స్ […]

సింగరేణి ఓపెన్ మైన్స్‌లో మహిళా ఆపరేటర్లు

సింగరేణి సంస్థలో ఇప్పటి వరకు జనరల్ అసిస్టెంట్లుగా, ట్రాన్స్‌ఫర్ వర్కర్లుగా పనిచేస్తున్న మహిళలు ఓపెన్ కాస్ట్ గనుల్లో భారీ యంత్రాలపై ఆపరేటర్లుగా పని చేయడానికి సింగరేణి యాజమాన్యం అవకాశం కల్పించేందుకు నిర్ణయించింది. మైనింగ్ లో మహిళాసాధికారత లక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సింగరేణి సంస్థ సిఎండి ఎన్.బలరామ్ వెల్లడించారు. మైనింగ్ రంగంలో మహిళల సాధికారత, సమాన అవకాశాలు, మానవ వనరుల సమర్థ వినియోగంలో భాగంగా ఇలాంటి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఓపెన్ కాస్ట్ గనుల్లో భారీ […]

యుపిఎస్‌సి తరహాలో పరీక్షలు నిర్వహించండి: రాంచందర్ రావు

యుపిఎస్‌సి తరహాలో రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టిజిపిఎస్‌సి) కూడా జాబ్ క్యాలెండర్ రూపొందించి ప్రతి ఏడాది పరీక్షలు నిర్వహించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరుద్యోగులు ఆమరణ నిరాహార దీక్షకు దిగక ముందే నోటిఫికేషన్ల విషయంలో స్పష్టత ఇవ్వాలని ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. గ్రూపు 1, గ్రూపు 2 పరీక్షలు పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. వేలాది మంది […]

ఈనెల 24న ట్యాంక్ బండ్ పై బిసి బతుకమ్మ

బిసిలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో బిసి రిజర్వేషన్‌లు 42 శాతానికి పెంచే బిల్లును కేంద్రం ఆమోదించాలని, మహిళా రిజర్వేషన్‌లలో బిసి మహిళలకు సబ్ కోటా డిమాండ్‌లతో ఈనెల 24న ట్యాంక్ బండ్ వద్ద వేలాదిమంది బిసి మహిళలతో బిసి బతకమ్మ నిర్వహించనున్నట్లు బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజు ల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శనివారం బిసి మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బర్ల మణిమంజరి సాగర్ ఆధ్వర్యంలో హైదరాబాదులోని బిసి భవన్‌లో బిసి […]

మహిళా స్వయం సంఘాలకు దసరా జోష్

రానున్న దసరా పండుగకు మహిళా సంఘాల్లో జోష్ నింపేందుకు ప్రతి సభ్యురాలికి చీరలు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగకు పంపిణీ చేసిన చీరల్లో నాణ్యత లేదని పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. తక్కువ ధర ఉన్న, ఏ మాత్రం నాణ్యత లేని చీరలను పంపిణీ చేశారని విమర్శలు వెల్లువెత్తాయి. అదీ గుజరాత్‌లోని సూరత్ నుంచి తీసుకువచ్చి కోటి మంది మహిళలకు ఆనాటి బిఆర్‌ఎస్ సర్కార్ చీరలు […]

మహోధృత ఉద్యమ రూపం సకల జనుల సమ్మె:కెటిఆర్

KTR

తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష ఎంత బలంగా ఉందో చాటి చెప్పిన మహోధృత ఉద్యమ రూపం సకల జనుల సమ్మె అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యానించారు. సబ్బండ వర్గాల ప్రజలు ఏకమై, 42 రోజుల పాటు శాంతియుతంగా నిరసన తెలిపి, తెలంగాణ సెగను ఢిల్లీకి తాకేలా చేసిన మహోన్నత ఘట్టం సకల జనుల సమ్మె అని పేర్కొన్నారు. 2011 సెప్టెంబర్ 12 రోజున కరీంనగర్ జనగర్జనలో ఉద్యమ సారథి కెసిఆర్ పిలుపు మేరకు యావత్ […]