26 మంది ప్రాణాలకంటే డబ్బే ఎక్కువైందా..? :అసదుద్దీన్ ఒవైసీ

పహల్గాం దాడి తర్వాత పాక్‌తో క్రికెట్ మ్యాచ్ ఎలా ఆడుతారని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. మతాన్ని అడిగి మరీ 26 మందిని దారుణంగా కాల్చి చంపారని ఆయన గుర్తు చేశారు. ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ పాకిస్తాన్, భారత్ క్రికెట్ మ్యాచ్‌పై తీవ్రంగా స్పందించారు. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని చెప్పిన మోడీ మాటలను ఆయన గుర్తు చేశారు. క్రికెట్ మ్యాచ్ ఎలా జరుగుతుందో చెప్పాలని అసదుద్దీన్ ప్రధాని మోడీని నిలదీశారు. పహల్గామ్ […]

అలాయ్ బలాయ్‌.. సిఎం రేవంత్ రెడ్డికి దత్తన్న ఆహ్వానం

వచ్చే నెల మూడో తేదీన నిర్వహించతలపెట్టిన అలాయ్ బలాయ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆహ్వానించారు. ఆదివారం మర్యాదపూర్వకంగా సిఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి కలుసుకుని ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా యధావిధిగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు దత్తాత్రేయ ముఖ్యమంత్రికి వివరించారు. Also Read: ఈ నెల 17 నుంచి పోషణ మాసం ప్రారంభం

ఇంజనీర్లకు సిఎం ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు

తమ మేధో శక్తితో మానవ మనుగడకు ఎన్నో ఫలాలు అందించిన ఘనత ఇంజనీర్తదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇంజనీర్ల డే సందర్భంగా ఇంజనీర్లందరికీ సిఎం శుభాకాంక్షలు తెలిపారు. దేశ ఆర్ధికాభివృద్ధికి, భారతావని ప్రగతికి బలమైన పునాదులు నిర్మించిన భారతరత్న మెక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినం సందర్భంగా ఆయన జ్ఞాపకార్దం సెప్టెంబర్ 15న ఇంజనీర్స్ డేగా జరుపుకోవడం జరుగుందని సిఎం పేర్కొన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజనీరుగా, దార్శనికుడిగా విద్యాప్రదాతగా, నిపుణుడిగా, పారిశ్రామిక ప్రగతి చోదకుడిగా ప్రత్యేక చాటారన్నారు. అత్యుత్తమ […]

ఎంఎల్‌ఏ క్లబ్ ఎన్నికల్లో యునైటెడ్ ప్యానెల్ గెలుపు

బంజారాహిల్స్‌లోని శాసన సభ్యుల సాంస్కృతిక కేంద్రం (ఎంఎల్‌ఏ క్లబ్) 2025, 2027 సంవత్సరాలకు గాను ఆదివారం జరిగిన ఎన్నికల్లో యునైటెడ్ ప్యానెల్ గెలుపొందినట్లు ఎన్నికల అధికారి పి. నారాయణ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. నూతన అధ్యక్షులుగా డాక్టర్ వైవై రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కె. రామచంద్రా రెడ్డి, కోశాధికారిగా జి. మధుసూధన్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా కె.లక్ష్మి రెడ్డి, సంయుక్ల కార్యదర్శిగా ఎం. ఉపేందర్ రెడ్డి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి వెల్లడించారు. దీంతో పాటు సభ్యులుగా పి. […]

ఈ నెల 17 నుంచి పోషణ మాసం ప్రారంభం

ఈ నెల 17 నుంచి అక్టోబర్ 16 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పోషణ మాస మహోత్సవాన్ని నిర్వహించనున్నట్టు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. చిన్నారులు, మహిళల ఆరోగ్యం, పోషకాహారాన్ని మెరుగుపర్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మహోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తోంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా అంగన్వాడీ సిబ్బంది ద్వారా ప్రతి ఇంటికీ పోషణ సందేశం చేరవేసేలా ప్రభుత్వం కార్యచరణ సిద్దం చేసింది. పోషణ మాసం మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులంతా […]

గ్రూపు 1 ఉద్యోగాలు రాకూడదని కెటిఆర్ కుట్ర: ఎంపి చామల

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రూపు 1 ఉద్యోగ నియామకాలు జరగరాదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు చామల కిరణ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. గ్రూపు 1 పరీక్షలలో 563 అభ్యర్థుల వద్ద మూడు కోట్ల రూపాయల చొప్పున తీసుకుని ప్రభుత్వం వాళ్ళను ఎంపిక చేసిందని కెటిఆర్ చేసిన వ్యాఖ్యలను ఎంపి చామల ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగ నియామకాలు జరగలేదని ఆయన విమర్శించారు. […]

కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర వీడకపోవడం సిగ్గుచేటు: హరీశ్ రావు

Harish Rao comments Revanth Reddy

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయట్లేదని బిఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయకపోవటంపై హరీశ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొద్దునిద్ర వీడకపోవడం సిగ్గుచేటు అని విమర్శించారు.  రాష్ట్రంలోని విద్యాసంస్థలు మూతపడే పరిస్థితి ఉందని హరీశ్ ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 13 లక్షల విద్యార్థుల భవిష్యత్ అగమ్య గోచరమని, విద్యాసంస్థలు […]

క్రమశిక్షణ కమిటీతో భేటీ.. దళితుల సహకారంతోనే ఎదిగాను: నర్సారెడ్డి

Siddipet DCC President Narsa Reddy

హైదరాబాద్: క్రమశిక్షణ కమిటీతో సిద్ధిపేట డిసిసి అధ్యక్షుడు నర్సారెడ్డి (Siddipet DCC President Narsa Reddy) భేటీ ముగిసింది. గతంలో నర్సారెడ్డికి క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని కమిటీ ఆయనకు ఆదేశాలు జారీ చేసింది. తాను ఎవరినీ కించపర్చలేదని, దళితుల సహకారంతోనే ఎదిగానని చెప్పారు. దళితులకే పదవులు ఎక్కువ ఇచ్చానని, కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. Also Read: మూలాలు మరచి.. విన్యాసాలెందుకు? మునుగోడు కాంగ్రెస్ ఎంఎల్ఎ […]

కొండా సురేఖ వర్సెస్ నాయిని… భగ్గుమన్న విభేదాలు

Konda Surekha vs Naini

వరంగల్: మంత్రి కొండా సురేఖ, ఎంఎల్ఎ నాయిని రాజేందర్ రెడ్డి (Konda Surekha vs Naini) మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. కొండా సురేఖ లాగా పూటకో పార్టీ మారితే తాను కూడా 5 సార్లు ఎమ్మెల్యే అయ్యేవాడినని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. కొండా సురేఖ వ్యాఖ్యలకు రాజేందర్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అంతకు ముందు నాయిని రాజేందర్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ (Konda Surekha vs Naini) ఘాటు విమర్శలు చేశారు. […]

తెలంగాణలో కాంగ్రెస్ ను బిఆర్ఎస్ కాపాడుతోంది: కెటిఆర్

KTR comments Revanth Reddy

హైదరాబాద్: బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు కుటుంబాలకు న్యాయం చేస్తామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఎస్ఎల్ బిసి బాధిత కుటుంబాలకు ఎలాంటి పరిహారం కూడా అందించలేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్ఎల్ బిసి టన్నెల్ ప్రమాదం జరిగి 200 రోజులైనా ప్రభుత్వాలు స్పందించలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆరుగురి మృతదేహాలను ఇప్పటికీ వెలికి తీయలేదని కెటిఆర్ ధ్వజమెత్తారు. కాళేశ్వరంలోని సమస్యలకు ఎన్ డిఎస్ఎ బృందాన్ని పంపించిన […]