బండి సంజయ్‌పై పది కోట్ల పరువు నష్టం దావా వేసిన కెటిఆర్

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పది కోట్ల రూపాయల పరువునష్టం దావా వేశారు. ఫోన్ ట్యాంపింగ్ కేసులో బండి సంజయ్ నిరాధారమైన ఆరోపణ చేశారని పేర్కొంటూ రూ. 10 కోట్లకు సిటిసివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆరోపణలపై క్షమాపణ చెప్పాలని ఆగస్టు 11వ తేదీన సంజయ్‌కు కెటిఆర్ లీగల్ నోటీసులు పంపించారు. క్షమాపణ చెప్పడానికి బండి సంజయ్ నిరాకరించడంతో కెటిఆర్ సిటిసివిల్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను […]

ఇందిరమ్మ ఇళ్లకు రూ.1435 కోట్ల చెల్లింపులు

ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రూ.1,435 కోట్లను లబ్ధిదారులకు అందచేసినట్లు గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి.గౌతం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.15 లక్షల ఇళ్ల పనులు ప్రారంభం కాగా, 1.29 లక్షల ఇళ్ల పనులు పురోగతిలో ఉన్నాయని, వాటిలో సుమారు 20 వేల ఇళ్ల గోడలు, 8633 ఇళ్ల రూఫ్ పూర్తి అయ్యాయని ఎండి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం పూర్తయిన ఇళ్లకు గృహ ప్రవేశాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇళ్ల […]

రైతులు భూములు కోల్పోకుండా ప్రభుత్వాన్ని నిలదీస్తాం: హరీశ్

Harish Rao comments Revanth Reddy

హైదరాబాద్: ఆర్ఆర్ఆర్ కోసం అలైన్ మెంట్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారీతిన మారుస్తోందని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. రైతులు భూములు కోల్పోకుండా ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు. ఈ సందర్భంగా హరీశ్ మీడియాతో మాట్లాడుతూ.. అలైన్ మెంట్ మార్చి పేద రైతుల పొట్ట కొట్టడం దుర్మార్గమని, కాంగ్రెస్ అనాలోచిత చర్యల వల్ల రైతులు భూములు కోల్పోయే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. సిఎం రేవంత్ రెడ్డి సొంత భూములకు మేలు కలిగేలా అలైన్ మెంట్ మార్చడం […]

10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి : జగదీశ్ రెడ్డి

BRS MLAs Additional Secretary

హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై బిఆర్ఎస్ పార్టీ నిర్ణయం చెప్పాలని తమకు 3 రోజులు గడువు ఇచ్చారని బిఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణను తమకు తెలియజేశారని అన్నారు. శాసనసభ అదనపు కార్యదర్శి ఉపేందర్ రెడ్డిని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణపై బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభిప్రాయం చెప్పారు. ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణపై శాసనసభాపక్షం అభిప్రాయం అందించారు. 10 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు […]

ఆ విద్యార్థుల విద్యకు దెబ్బ కొడుతున్నారు: కెటిఆర్

KTR comments congress

హైదరాబాద్: గత సిఎంలు తీసుకువచ్చిన మంచి పథకాలను మాజీ సిఎం కెసిఆర్ కొనసాగించారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఎస్సి, ఎస్టి, బిసి, మైనారటీ విద్యార్థుల విద్యకు దెబ్బ కొడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో జూబ్లీహిల్స్ వెంగళరావు డివిజన్ బిఆర్ఎస్ శ్రేణులతో కెటిఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్లలో రూ. 20 వేల కోట్ల ఫీజు రీయింబెర్స్ మెంట్, 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు రూ. 3 వేల […]

స్టేషన్‌ ఘన్‌పూర్‌లో టెన్షన్ టెన్షన్

Tatikonda rajaiah padayatra

స్టేషన్‌ ఘన్‌పూర్‌: జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌లో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. మాజీ ఎంఎల్ఎ రాజయ్య పాదయాత్ర (Tatikonda rajaiah padayatra) కాంగ్రెస్‌ వర్సెస్ బిఆర్‌ఎస్‌గా మారింది.  రాజయ్య హనుమకొండ నుంచి పాదయాత్రకు బయల్దేరారు. రాజయ్య వెంట దాస్యం వినయ్‌, నన్నపునేని నరేందర్ ఉన్నారు. రాఘవపురం దగ్గర ఎంఎల్ఎ కడియం శ్రీహరి దిష్టిబొమ్మను బిఆర్ఎస్ కార్యకర్తలు దగ్ధం చేస్తుండగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. Also Read:  నో షేక్‌హ్యాండ్.. పాకిస్తాన్ కు భారత్ షాక్(వీడియో) ఈ […]

అక్రమ నిర్మాణాలను తొలిగించాల్సిన అవసరం ఉంది: కమిషనర్ రంగనాథ్

Many drains problematic

హైదరాబాద్: చాలా నాలాలు సమస్యాత్మకంగా మారాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైదరాబాద్ లో నాలాలు కబ్జా అయ్యాయని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అక్రమ నిర్మాణాలను తొలిగించాల్సిన అవసరం ఉందని, అక్రమ నిర్మాణాలు నాలాల నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారాయని ఆవేదనను వ్యక్తం చేశారు. కొన్ని ఇళ్లు తొలగించాలని నిర్ణయించామని అన్నారు. హైడ్రా ఉన్నది ప్రజల కోసమేనని సమస్యలు పరిష్కరిస్తామని కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. Also Read : కాలేజీలు బంద్ చేస్తే విద్యార్థుల పరిస్థితి ఏంటి?: […]

ఫీ రీయింబర్స్ మెంట్ లో కాంగ్రెసోళ్లకు 20 శాతం కమీషన్లు: కవిత

Fee reimbursement commission

హైదరాబాద్: ఆడబిడ్డల చదువులను కాంగ్రెస్ కమీషన్ల సర్కారు కాలరాస్తోందని ఎంఎల్ సి కవిత మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా ఫీ రీయింబర్స్ మెంట్ బకాయిలను తెలంగాణ ప్రభుత్వం ఎగవేస్తుందని దుయ్యబట్టారు. సోమవారం ఆమె తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 20 శాతం కమీషన్లు ఇస్తేనే రీయింబర్స్ మెంట్ బకాయిలు ఇస్తామని ప్రభుత్వంలోని కొందరు డిమాండ్ చేస్తున్నారని… దీంతో కాలేజీల యాజమాన్యాలు ఆవేదన చెందుతున్నాయని ఆరోపణలు చేశారు. కమీషన్ల కోసమే బకాయిలు ఏళ్లకేళ్లుగా పెండింగ్ లో పెట్టారని, ఇప్పటికే కాలేజీలు […]

కవితతో విష్ణువర్ధన్ రెడ్డి భేటీ…. జూబ్లీహిల్స్ అభ్యర్థి?

Vishnuvardhan Reddy meets Kavitha

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో ఎంఎల్ఎ కవిత తరపున అభ్యర్థిని బరిలోకి దించే అవకాశం ఉంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి సమావేశమయ్యారు. ఇద్దరు మధ్య దాదాపుగా అరగంటకు పైగా మంతనాలు సాగాయి. ఉపఎన్నికలో విష్ణును పోటీకి దించే యోచనలో కల్వకుంట్ల కవిత ఉన్నట్టు సమాచారం. Also Read:  నో షేక్‌హ్యాండ్.. పాకిస్తాన్ కు భారత్ షాక్(వీడియో) బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా దివంగత ఎంఎల్‌ఎ మాగంటి గోపీనాథ్ సతీమణి […]

కాలేజీలు బంద్ చేస్తే విద్యార్థుల పరిస్థితి ఏంటి?: బండి

Bandi Sanjay comments congress

హైదరాబాద్: బిఆర్ఎస్ మాజీ సిఎం కెసిఆర్ పదేళ్ల పాలనలో రూ. వేల కోట్ల బకాయిలు పెట్టారని బిజెపి కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించకపోవడం దుర్మార్గం అని అన్నారు. ఈ సందర్భంగా మంచిర్యాలలో బండి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలన వచ్చినా పరిస్థితి మారలేదని, కాలేజీలకు టోకెన్లు టైంపాస్ చేస్తున్నారని విమర్శించారు. కాలేజీలు బంద్ చేస్తే విద్యార్థుల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని […]