రైల్వే రిజర్వేషన్‌కు ఆధార్ లింక్

రైల్వే టికెట్ బుకింగ్ వ్యవస్థలో పారదర్శకత పెంచేందుకు, మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి జనరల్ రిజర్వేషన్ టికెట్‌ల బుకింగ్‌కు కూడా ఆధార్‌ను తప్పనిసరి చేయబోతోంది. ఈ నిబంధన బుకింగ్ ప్రక్రియ మొత్తానికి కాకుండా, టికెట్లు అందుబాటులోకి వచ్చిన మొదటి 15 నిమిషాల వరకు మాత్రమే వర్తిస్తుంది. ప్రస్తుతం తత్కాల్ టికెట్‌లు బుక్ చేసుకోవాలంటే ఐఆర్‌సిటిసి ఖాతాకు ఆధార్ అనుసంధానం తప్పనిసరిగా ఉంది. ఇప్పుడు ఈ విధానాన్ని జనరల్ […]

అలైన్‌మెంట్‌పై నిరసన

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని నగరానికి మరో మణిహారంగా మారను న్న రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణ భాగంలో అలైన్ మెంట్ మార్పులు రైతుల్లో ఆ గ్రహానికి కారణం అవుతోంది. రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణ భాగంలో 201 కిలోమీటర్ల మేరకు నిర్మాణానికి వీలుగా మూడు అలైన్‌మెంట్లను ప్రతిపాదించారు. అయితే తమకు ఎలాంటి సమాచారం లేకుండా అలైన్‌మెంట్ మార్పులు చేశారని, పేద, మధ్యతరగతి రైతులు మొత్తం సాగుభూములను కోల్పోయే పరిస్థితి నెలకొందని గత […]

తీరనున్న యూరియా కష్టం

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర రైతుల అవసరాలకు సరిపడా యూరియాను వీలైనంత త్వర గా కేటాయించి, పంపిణీ అయ్యేలా చూడాలని ఢి ల్లీలోని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రాను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సోమవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కేంద్ర ఎరువుల కార్యదర్శిని కలిశారు. రాష్ట్ర రైతులకు సరిపడా యూరియాను ఈ పది రోజుల్లో సరఫరా చేయాలని, వివిధ కారణాలతో యూరియా దిగుమతి […]

అక్టోబర్ 1 నుంచి రైల్వే టికెట్ బుకింగ్‌లో కొత్త నిబంధనలు

రైల్వే టికెట్ బుకింగ్ వ్యవస్థలో పారదర్శకత పెంచేందుకు, మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి జనరల్ రిజర్వేషన్ టికెట్‌ల బుకింగ్‌కు కూడా ఆధార్‌ను తప్పనిసరి చేయబోతోంది. ఈ నిబంధన బుకింగ్ ప్రక్రియ మొత్తానికి కాకుండా, టికెట్లు అందుబాటులోకి వచ్చిన మొదటి 15 నిమిషాల వరకు మాత్రమే వర్తిస్తుంది. ప్రస్తుతం తత్కాల్ టికెట్‌లు బుక్ చేసుకోవాలంటే ఐఆర్‌సిటిసి ఖాతాకు ఆధార్ అనుసంధానం తప్పనిసరిగా ఉంది. ఇప్పుడు ఈ విధానాన్ని జనరల్ […]

ముగిసిన హెల్త్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2025

హెల్త్ ఆర్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్‌డబ్ల్యుఈ సెర్చ్ అండ్ హెల్త్ ఇన్నోవేషన్ సమ్మిట్ -2025 సోమవారం ముగిసింది. హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ సమ్మిట్‌లో 13 దేశాల నుండి 2,800 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. 62 మంది ప్రముఖులు, 42 అగ్రశ్రేణి సంస్థల ప్రతినిధులు పాల్గొని ఆరోగ్యరంగంలో వాస్తవ ప్రపంచ సాక్ష్యాలు, కృత్రిమ మేధస్సు, డిజిటల్ హెల్త్, ఇన్నోవేషన్ పై చర్చలు జరిపారు. ఈ సమ్మిట్‌ను రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, ఇండస్ట్రీస్ […]

వక్ఫ్ సవరణ చట్టం 2025పై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను స్వాగతించిన కెటిఆర్

KTR

వక్ఫ్ సవరణ చట్టం 2025పై సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్వాగతించారు. ఈ చట్టంలోని వివాదాస్పద నిబంధనలపై బిఆర్‌ఎస్ మొదటి నుంచి తన ఆందోళనలను గట్టిగా వినిపించిందని ఆయన పేర్కొన్నారు. ఈ చట్టం ప్రగతిశీలత ముసుగులో దేశంలో విభజన రాజకీయాలకు, మత సామరస్యానికి విఘాతం కలిగించడానికి ప్రయత్నిస్తోందని తాము ఎప్పుడూ చెబుతూనే ఉన్నామని అన్నారు. వక్ఫ్ సవరణ చట్టంలోని సమస్యలపైన తాము పోరాడామని తెలిపారు. ఒక వ్యక్తి ముస్లిం అని ఎవరు […]

17వ మినీ హ్యాండ్‌బాల్ నేషనల్ ఛాంపియన్‌షిప్ గోడపత్రికను ఆవిష్కరించిన సిఎం

తెలంగాణ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 26 నుండి 29 వరకు నిజాం కళాశాలలో జరిగే 17వ హెచ్‌ఎఫ్‌ఐ మినీ హ్యాండ్బాల్ నేషనల్ ఛాంపియన్‌షిప్ పోస్టర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సోమవారం ఆవిష్కరించారు. క్రీడలకు ప్రోత్సాహాన్ని అందిస్తూ, రాష్ట్రంలోని యువత క్రీడల వైపు మరింత ఆసక్తితో ముందడుగు వేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి సుమారు 1200 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను […]

ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంట్‌ను ప్రభుత్వం ఇష్టారీతిన మారుస్తోంది: హరీష్‌రావు

రీజినల్ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) కోసం అలైన్‌మెంట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారీతిన మారుస్తోందని, రైతులు తమ భూములు కోల్పోకుండా నిలదీస్తామని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ, మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు.సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ మండలం గ్రామాల రైతులు సోమవారం హరీష్ రావును కలిశారు. ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంట్ మార్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. అలైన్‌మెంట్ మార్చి పేద రైతుల పొట్ట కొట్టడం దుర్మార్గమన్నారు. కాంగ్రెస్ అనాలోచిత చర్యల వల్ల రైతులు భూములు […]

బండి సంజయ్‌పై పరువునష్టం దావా వేసిన కెటిఆర్

KTR

హైదరాబాద్: కేంద్రమంత్రి బండిసంజయ్‌పై చట్టరీత్య చర్యలు తీసుకొనేందుకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ (KTR) సిద్ధమయ్యారు. ఫోన్‌ ట్యాపింగ్ అంశాంలో తనపై ఆరోపణలు చేసినందుకు బండి సంజయ్‌పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. సిటీ సివిల్ కోర్టులో ఆయన ఈ పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు బండి సంజయ్‌కి కెటిఆర్ గత నెలలోనే లీగల్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. బండి సంజయ్ […]

సినిమాల చిత్రీకరణ మరింత సులభతరం: దిల్ రాజు

రాష్ట్రంలో సినిమాల తయారీ ఇక సులభతరమని రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ(ఎఫ్‌డిసి) చైర్మన్ దిల్ రాజు అన్నారు. సినిమాల చిత్రీకరణ, సినిమాల చిత్రీకరణలకు కావాల్సిన అన్ని అనుమతులు, సినిమా థియేటర్ ల నిర్వహణకు పొందాల్సిన అనుమతులు, సినీ రంగాభివృద్దికి కావాల్సిన అనుమతులు అన్నీ సింగిల్ విండో ద్వారా పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక వెబ్ సైట్ రూపొందిస్తోందని ఆయన వెల్లడించారు. సినిమా అనుమంతులపై రూపొందిస్తున్న ప్రత్యేక వెబ్ సైట్ ’ఫిలిమ్స్ ఇన్ తెలంగాణ‘ పై […]