బోధన్‌లో ఉగ్రకలకలం

మన తెలంగాణ/హైదరాబాద్/నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా బోధన్ ఒక్కసారిగా ఉలికిపడింది. ‘ఉగ్ర’ లింకులు కలకలం సృష్టించాయి. ఎన్‌ఐఎ, కేంద్ర దర్యాప్తు సంస్థలు నిజామాబాద్ జిల్లా బోధన్‌లో తనిఖీలు చేపట్టాయి. ‘బోధన్ పట్టణంలో బుధవారం తెల్లవారు జామున ఎన్‌ఐఎ విస్తృతంగా తనిఖీలు ని ర్వహించాయి. కాగాఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలు కలిగి ఉన్నట్లు అ నుమానిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. అనంతరం బోధన్ కోర్టు లో ప్రవేశపెట్టి కస్టడీకి తీసుకున్నట్లు సమాచారం. కాగా ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా కేంద్ర […]

పిడుగుపాటుకు ఏడుగురు మృతి

రాష్ట్ర వ్యాప్తంగా పిడుగు పాటుకు ఏడుగురు మృతి చెందారు. నిర్మల్ జిల్లాల్లో ఇద్దరు దంపతులతో పాటు ఒక వ్యక్తి మృతి చెందగా, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ముగ్గురు కూలీలు మృత్యువాతపడ్డారు. ఖమ్మం జిల్లాల్లో ఒక్కరు పిడుగు పాటుకు బలయ్యారు. నిర్మల్ జిల్లా పెంబి మండలం గుమ్మేన ఏంగ్లాపూర్ గ్రామానికి చెందిన దంపతులు అల్లేపు ఎల్లయ్య, ఆల్లేపు ఏళ్లవ్వతో పాటు బండారు వెంకటిలు గ్రామ సమీపంలో వ్యవసాయ పనులకు వెళ్లారు తిరిగి వస్తున్న క్రమంలో పిడుగు పడటంతో అక్కడిక్కడే […]

డైవర్షన్ పాలిటిక్స్ మానండి:హరీశ్‌రావు

దేశ చరిత్రలో యూరియా కోసం రైతులు ఇంతగా తిప్పలు పడ్డ పరిస్థితులు ముందెన్నడూ లేదని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎంఎల్‌ఎ హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేతగాని, దద్దమ్మ పాలన వల్ల పంట పొలాల్లో ఉండాల్సిన రైతులు యూరియా కోసం నడిరోడ్ల వెంట బారులు తీరుతున్నారని, ఆధార్ కార్డు, పాస్ బుక్కులు చేత పట్టుకొని యూరియా బస్తా కోసం పడిగాపులు కాస్తున్నరని, పండుగ లేదు..పబ్బం లేదు..వాన లేదు..ఎండ లేదు, రాత్రి లేదు, పగలు లేదు క్యూలో […]

జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ?

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలకు బీఆర్‌ఎస్ అభ్యర్థిగా దివంగత సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ భార్య సునీతను ఆ పార్టీ ఖరారు చేసింది. ఈ విషయాన్ని బీఆర్‌ఎస్ అధికారికంగా ప్రకటించనప్పటికీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరోక్షంగా వెల్లడించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, మాగంటి గోపినాథ్ కుటుంబానికి పార్టీ కార్యకర్తలు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. మాగంటి సునీతను వే దికపైకి ఆహ్వానించి కార్యకర్తలకు కేటీఆర్ […]

మీసేవ ద్వారా సులభంగా కుల ధ్రువీకరణ పత్రాలు

రాష్ట్రంలో కుల ధ్రువీకరణ పత్రాల జారీని మరింత వేగవంతం చేస్తూ, ప్రజలకు సులభతరం చేస్తామని ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. మీసేవ ద్వారా ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చిన 15 రోజుల్లోనే 17,500 మందికి పైగా లబ్ధి చేకూరిందని, ప్రతి సంవత్సరం దాదాపు 20 లక్షల మంది ఈ మార్పులతో ప్రయోజనం పొందనున్నారని ఆయన తెలిపారు. కొత్త విధానంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు కుల ధ్రువీకరణ […]

హేమంత్ సోరెన్‌ని కలిసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

ఝార్ఖండ్ పర్యటనలో భాగంగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, సీఎం హేమంత్ తండ్రి శిబూ సోరెన్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. శిబూ సోరెన్ మృతి పట్ల డిప్యూటీ సీఎం తన సంతాపాన్ని ప్రకటించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జిగా అక్కడ విస్తృతంగా పర్యటించి […]

వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్న జిల్లాలకు రూ.10 కోట్లు

వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్న జిల్లాలకు రూ.10 కోట్లు, సాధారణ నష్టం జరిగిన జిల్లాలకు రూ.5 కోట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. ఇటీవల రాష్ట్రంలో ప్రధానంగా కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో చేపట్టిన సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు బుధవారం […]

15 ఉద్యోగ సంఘాలకు మళ్లీ గుర్తింపు

ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చొరవతో సుధీర్ఘకాలం తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉద్యోగసంఘాలు తిరిగి ప్రభుత్వ గుర్తింపునకు నోచుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ఉద్యోగసంఘాలకు గుర్తింపు ఇవ్వాలన్న ఉద్యోగ సంఘాల విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆమోదం తెలిపింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు(జివో నెం.185) జారీచేసింది. మంగళవారం ఉద్యోగ సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుతో సమావేశమయ్యారు. వెంటనే సాధారణ పరిపాలన శాఖ(జిఎడి) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి […]

జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కు ఓటేస్తే మీ ఇంటిని కూలగొట్టే లైసెన్స్ ఇచ్చినట్టే: కెటిఆర్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే, తమ ఇండ్లను కూలగొట్టేందుకు ప్రభుత్వానికి లైసెన్స్ ఇచ్చినట్టేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ హెచ్చరించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టడమేనా ప్రశ్నించారు. హైడ్రా పేరుతో బిల్డర్లను బెదిరించి కాంగ్రెస్ నేతలు కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఉప ఎన్నికలలో కారు గుర్తుకు ఓటేసి కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డి అహంకారాన్ని బొందపెట్టాలని జూబ్ల్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో బుధవారం జరిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల […]

‘రాజకీయ సన్యాసం చేస్తా’.. రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు

Raja Singh

హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు ఇప్పుడున్న కమిటీతో బిజెపి రాష్ట్రంలో అధికారంలోకి వస్తే.. తాను రాజకీయ సన్యాసం చేస్తానని అన్నారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయను అన్న రాజాసింగ్.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రాజీనామా చేస్తే తాను చేస్తానని అన్నారు. ఇద్దరూ కలిసి ఎన్నికలకు వెళ్ధాం అని సవాల్ చేశారు. బిజెపి తనకు ఎలాంటి సహకారాలు అందించలేదని.. పార్టీలో తాను ఎలాంటి పదవి ఆశించలేదని స్పష్టం చేశారు. ‘‘ఢిల్లీ […]