డిగ్రీలో ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు

రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో మిగిలిన ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఉన్నన విద్యామండలి చైర్మన్ వి.బాలకిష్టారెడ్డి వెల్లడించారు. ఈ నెల 12వ తేదీన ప్రభుత్వ, ప్రైవేట్, అటామనస్ డిగ్రీ కాలేజీలు ఖాళీ సీట్ల వివరాలు నోటీసులు బోర్డులో పొందుపరచడంతో పాటు https://dost.cgg.gov.in వెబ్‌సైట్‌లో పెట్టాలని తెలిపారు. ఈనెల 15,16 తేదీలలో ఆయా కాలేజీలు స్పాట్ అడ్మిషన్లు చేపట్టాలని పేర్కొన్నారు. అదేవిధంగా లోకల్ విద్యార్థులతో ఇతర రాష్ట్రాలకు చెందిన నాన్ లోకల్ విద్యార్థుల కోసం […]

కవితతో చింతమడక వాసుల భేటీ

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో ఆమె తండ్రి కెసిఆర్ సొంత ఊరు చింతమడక గ్రామస్తుల భేటీ అయ్యారు. బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన చింతమడక గ్రామస్తులు ఈనెల 21న ఎంగిలి పూల బతుకమ్మ పండుగకు రావాలని ఆహ్వానించారు. కవిత స్పందిస్తూ..గొప్ప ఉద్యమకారుడిని కన్న గొప్ప ఊరు మా చింతమడక అని పేర్కొన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి తనను బతుకమ్మకు ఆహ్వానించడం సంతోషంగా ఉందని అన్నారు. తాను చింతమడక నుంచి ఎంతో నేర్చుకున్నానని, […]

విమోచన దినోత్సవ వేడుకలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాక

హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్య్రం ఎలా లభించిందో, గ్రామీణ ప్రాంతాల్లో నిజాం పాలనలో జరిగిన అత్యాచారాలు, అరాచకాలను తెలియజేసేలా, ఆర్యసమాజ్ వంటి సంస్థలు రజాకర్లకు వ్యతిరేకంగా చేపట్టిన పోరాటాన్ని రజాకర్ సినిమాలో స్పష్టంగా చూపించారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రావు అన్నారు. రజాకర్ చిత్ర నిర్మాత గూడూరు నారాయణ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ లాబ్స్‌లో ‘రజాకర్’ సినిమా వీక్షించిన అనంతరం బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ […]

దేశానికి సీడ్ హబ్ గా రాష్ట్రం: మంత్రి తుమ్మల

దేశానికి సీడ్ హబ్ గా రాష్ట్రం నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఇండియా, ఆఫ్రికా సీడ్ సమ్మిట్ 2025లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ అవసరాల్లో 60 శాతం విత్తనాలను రాష్ట్రం నుంచే సరఫరా చేయడమే కాకుండా, 20కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నామన్నారు. రాష్ట్ర విత్తన ఉత్పత్తి సామర్థ్యాన్ని మంత్రి వివరించారు. వెయ్యికి పైగా విత్తన కంపెనీలు, […]

కెటిఆర్‌కు అరుదైన గ్లోబల్ గౌరవం

KTR

భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కె.టి. రామారావుకు అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. సుస్థిర పాలన, పర్యావరణ పరిరక్షణలో ఆయన చేసిన కృషికి గాను ప్రతిష్టాత్మకమైన ‘గ్రీన్ లీడర్‌షిప్ అవార్డు 2025’కు ఆయన ఎంపికయ్యారు. ఈ నెల చివరిలో అమెరికాలోని న్యూయార్క్‌లో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డు ప్రదానోత్సవం సెప్టెంబర్ 24న న్యూయార్క్‌లో జరగనున్న 9వ ఎన్‌వైసి గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్‌లో జరగనుంది. ఈ విషయాన్ని గ్రీన్ మెంటార్స్ సంస్థ అధికారికంగా […]

గ్రూప్ 1 పోస్టుల అమ్మకాల ఆరోపణలపై ప్రభుత్వం స్పందించాలి:కెటిఆర్

గ్రూప్ 1 పోస్టుల కోసం డబ్బులు చేతులు మారాయని పలువురు విద్యార్థులు చేస్తున్న ఆరోపణలపైన ప్రభుత్వం స్పందించాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వంలోని మంత్రులు, ముఖ్యమంత్రి కార్యాలయం గ్రూప్ 1 అభ్యర్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు నేరుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశంలో తగిన విచారణ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. గ్రూప్ 1 పోస్టుల కోసం భారీగా డబ్బులను డిమాండ్ చేసినట్లు పలువురు విద్యార్థులు మీడియాలో చేస్తున్న […]

42% రిజర్వేషన్లకు లైన్‌క్లియర్

42% reservations for BC

హైదరాబాద్: తెలంగాణలో బిసిలకు 42% రిజర్వేషన్లకు లైన్‌క్లియర్ అయ్యింది. పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్ట సవరణకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. 50 శాతం రిజర్వేషన్ల క్యాప్‌ ఎత్తివేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. గెజిట్ నోటిఫికేషన్‌ విడుదలకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. 42శాతం రిజర్వేషన్‌ల బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టి ఆమోదం చేసుకొని, గవర్నర్ ఆమోదానికి పంపించిన విషయం తెలిసిందే. జనాభా ప్రకారం బిసిలకు 42 శాతం రిజర్వేషన్లను […]

ప్రతి అంశంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది: రామచందర్ రావు

Ramachandra Rao comments Revanth Reddy

హైదరాబాద్: యూరియా కృత్రిమ కొరతను కాంగ్రెస్ నాయకులు సృష్టించారని బిజెపి అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. కేంద్రం.. తెలంగాణ వాటా యూరియా ఎప్పుడో ఇచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా అమీర్ పేట్ లో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి అంశంలోనూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. గ్రూప్-1 అంశంలో న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని రామచందర్ తెలియజేశారు. గ్రూప్-1 అంశంలో టిజిపిఎస్సి తప్పుల మీద తప్పులు చేసిందని ఎద్దేవా […]

ఆ వార్తల్లో నిజం లేదు: దానం

Jublihills by Election

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం చాలా ముఖ్యమని ఎంఎల్‌ఎ దానం నాగేందర్ తెలిపారు. జూబ్లీహిల్స్ కోసం సరైన అభ్యర్థిని ఎంపిక చేస్తుందన్నారు. ఆదర్శ్‌నగర్‌లోని న్యూఎంఎల్‌ఎ క్వార్టర్స్‌లో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు దానం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ నుంచి తాను పోటీ చేస్తున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. టికెట్ ఎవరికి కేటాయించిన కాంగ్రెస్ పార్టీ విజయం కోసం […]

యువత నమ్మకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వమ్ము చేసింది: కెటిఆర్

KTR comments congress

హైదరాబాద్: గ్రూప్-1 పోస్టుల కోసం సిఎంవొలు డబ్బులు డిమాండ్ చేసినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. గ్రూప్-1 పోస్టులు అమ్ముకున్నట్లు మంత్రులు, సిఎంవొపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..యువత నమ్మకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వమ్ము చేసిందని, డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలపై కాంగ్రెస్ స్పందించాలని సూచించారు. ఆరోపణల దృష్ట్యా తగిన విచారణ జరగాల్సిన అవసరం ఉందని, హైకోర్టు ఆదేశాల మేరకు అక్రమాలకు తావు లేకుండా మళ్లీ పరీక్ష […]