మెట్రోలో ట్రాన్స్‌జెండర్లకు సెక్యూరిటీగా విధులు

ట్రాన్స్ జెండర్ల ఉపాధి విషయంలో శ్రధ్ద కనబరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ట్రాఫిక్ అసిస్టెంట్స్‌గా ట్రాన్స్‌జెండర్లను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు హైదరాబాద్ మెట్రో రైళ్లలో సెక్యూరిటీ గార్డులుగా నియమించింది. ఇందుకు సంబంధించి మంగళవారం 20 మంది ట్రాన్స్‌జెండర్లకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సచివాలయంలోని తన ఛాండర్‌లో నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్స్‌కు ఆత్మగౌవరంగా బతికేందుకు అవకాశం కల్పిస్తోందన్నారు. ట్రాన్స్ […]

ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్..

రాష్ట్రంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ వద్దిరాజు రాకేష్ స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు పేరుకుపోవడంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఒక ఒక ప్రకటనలో వెల్లడించారు. గత ఏడాది కాలంగా ఆరోగ్యశ్రీకి, 18 నెలలుగా ఈహెచ్‌ఎస్‌కు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం చెల్లించడం లేదని ఆరోపించారు. పేరుకుపోయిన బకాయిల వల్ల ఆస్పత్రుల నిర్వహణ తీవ్ర భారంగా మారిందని, ఈ పరిస్థితుల్లో సేవలను కొనసాగించలేమని వివరించారు. […]

త్వరలో మహిళా పాలసీ ప్రకటిస్తాం : మంత్రులు సీతక్క, సురేఖ

సమాజంలో మహిళల పాత్ర కీలకమైనదని రాష్ట్ర మంత్రులు డి. అనసూయ సీతక్క, కొండా సురేఖలు అన్నారు. ప్రభుత్వం మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులు సమర్థవంతంగా విధులు నిర్వహించి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల ఫలితాలను ప్రజలకు అందించే దిశలో పని చేయాలని, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని మంత్రులు సూచించారు. మంగళవారం సచివాలయంలో జరిగిన తెలంగాణ సెక్రటేరియట్ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం లోగో ఆవిష్కరణ, సర్వ […]

రామ్‌గోపాల్‌వర్మపై మరో కేసు నమోదు

Ram Gopal Varma

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై రిటైర్డ్ ఐపిఎస్ అంజనా సిన్హా హైదరాబాద్‌లో ఫిర్యాదు చేశారు. తన అనుమతి లేకుండా తన ఐడెంటిటీని తప్పుగా ఉపయోగించారని ఆమె రాయదుర్గం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దహనం అనే వెబ్‌సిరీస్‌లో తన అనుమతి లేకుండా తన ఫ్రొఫెషనల్ ఐడెంటిటీని వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించారని అంజనా ఫిర్యాదులో పేర్కొన్నారు. ’దహనం’ వెబ్‌సిరిస్‌కు నిర్మాత రామ్‌గోపాల్‌వర్మ, దర్శకుడు అగస్త్య మంజు. 2022లో చిత్రీకరించిన దహనం వెబ్‌సిరీస్‌పై ఫిర్యాదు వచ్చింది. కథ రాయల సీమ […]

బిజెపిది నకిలీ జాతీయవాదం: కెటిఆర్

వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను బిఆర్‌ఎస్ స్వాగతించడాన్ని విమర్శిస్తున్న బిజెపి నేతలకు భారత రాజ్యాంగం, సుప్రీం కోర్టు మీద ఏమాత్రం గౌరవం లేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. బిజెపిది నకిలీ జాతీయవాదమని, తమది మాత్రం ఆచరణలో, ఆత్మలో నిజమైన జాతీయవాదమని స్పష్టం చేశారు. కులం, మతం, వర్గం చూడకుండా ప్రతి భారతీయుడినీ సమానంగా ఆదరించడమే తమ దృష్టిలో నిజమైన జాతీయవాదం అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయవాదానికి, దురహంకార దేశభక్తికి (జింగోయిజం) […]

త్వరలో కిషోర బాలికా సంఘాలు : మంత్రి సీతక్క

మహిళా స్వయం సహాయక బృందాల తరహాలోనే కౌమార బాలిక సంఘాలను ఏర్పాటు చేస్తామని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. ధనసరి అనసూయ సీతక్క ప్రకటించారు. కౌమార బాలిక సంఘాల ఏర్పాటు పై అధికారులకు మంత్రి సీతక్క దిశ నిర్దేషం చేశారు. కౌమార బాలిక సంఘాల ఏర్పాటుతో ఎన్నో సామాజిక రుగ్మతలను రూపుమాపవచ్చని మంత్రి పేర్కొన్నారు. బేగంపేటలోని జ్యోతి రావు పూలే ప్రజా భవన్‌లో కౌమార బాలికల భద్రత, ఆరోగ్యం, పోషణ, […]

సర్పంచ్‌లకే పవర్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రమంతటా ఎ ల్‌ఈడీ వీధి దీపాలపై పక్కాగా పర్యవేక్షణ ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాల్లో వీధి దీపాల ఏ ర్పాటు, వాటి నిర్వహణ బాధ్యతలను సర్పంచ్‌లకే అప్పగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రా మాల్లో అవసరమైన కొత్త ఎల్‌ఈడీ లైట్లను అమర్చటంతో పాటు వాటిని సమర్థంగా నిర్వహించే నిర్వహణ అధికారం గ్రామ పంచాయతీల పరిధిలోనే ఉండాలని ఆయన స్పష్టం చేశారు. గ్రామా ల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎల్‌ఈడీ […]

ఫీజుల చర్చలు సఫలం

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో ప్ర భుత్వం చర్చలు సఫలమయ్యాయి. దీపావళిలోగా రూ.1200 కోట్ల బకాయిలు విడుదల చేసేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందులో ప్రస్తుతం రూ.600 కోట్ల బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీపావళికి మరో రూ.600 కోట్లు విడుదల చేస్తామని తెలిపింది. దీంతో మంగళవారం ప్రైవేట్ కాలేజీలు యథావిధిగా కొనసాగనున్నాయి. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలలో ప్రభుత్వ తీరును నిరసి స్తూ వృత్తి విద్య సహా డిగ్రీ, కాలేజీలు […]

రేపు ప్రజాపాలన దినోత్సవం

ఈనెల 17వ తేదీని ప్రజా పాలన దినోత్సవం నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఆయా జిల్లా ఇంచార్జీ మంత్రి జాతీయ జెండా ఎగురవేయాలని ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. సిఎం రేవంత్ రెడ్డి సైతం 17వ తేదీన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జాతీయ జెండా ఎగురవేయనున్నారు. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఆయన సొంత జిల్లా ఖమ్మంలో జెండా ఆవిష్కరించనుండగా మంత్రులు వివేక్ మెదక్ జిల్లాలో, కొండా సురేఖ, వరంగల్‌లో, […]

రైల్వే రిజర్వేషన్‌కు ఆధార్ లింక్

రైల్వే టికెట్ బుకింగ్ వ్యవస్థలో పారదర్శకత పెంచేందుకు, మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి జనరల్ రిజర్వేషన్ టికెట్‌ల బుకింగ్‌కు కూడా ఆధార్‌ను తప్పనిసరి చేయబోతోంది. ఈ నిబంధన బుకింగ్ ప్రక్రియ మొత్తానికి కాకుండా, టికెట్లు అందుబాటులోకి వచ్చిన మొదటి 15 నిమిషాల వరకు మాత్రమే వర్తిస్తుంది. ప్రస్తుతం తత్కాల్ టికెట్‌లు బుక్ చేసుకోవాలంటే ఐఆర్‌సిటిసి ఖాతాకు ఆధార్ అనుసంధానం తప్పనిసరిగా ఉంది. ఇప్పుడు ఈ విధానాన్ని జనరల్ […]