ఒఆర్‌ఆర్‌పై బోల్తాపడిన కారు: ఇన్ఫోసిస్ ఉద్యోగిని మృతి

Sarala Maisamma Temple

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఒఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి బోల్తాపడడంతో టెకీ మృతి చెందగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఇన్ఫోసిస్ ఉద్యోగిని సౌమ్యారెడ్డిగా గుర్తించారు. ఇన్ఫోసిస్ ఉద్యోగులు సరళ మైసమ్మ దేవాలయానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. Also Read:  నో షేక్‌హ్యాండ్.. పాకిస్తాన్ కు భారత్ షాక్(వీడియో)  

హనీట్రాప్‌లో యోగా గురువు.. ఐదుగురు అరెస్ట్

Honey Trap

హైదరాబాద్: డబ్బులు సంపాదించడానికి సులభమైన మార్గాలు ఎంచుకుంటున్నారు కొందరు వ్యక్తులు. అలా ఎంచుకుంటున్న మార్గాల్లో ఒకటి హనీట్రాప్(Honey Trap). మహిళలను అడ్డంపెట్టుకొని బ్లాక్‌మెయిల్ చేసి.. లక్షల్లో డబ్బు కాజేస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో హనీట్రాప్ కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో యోగాశ్రమం నడుపుతున్నాడు రంగారెడ్డి అనే వ్యక్తి. అయితే అతని వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయవచ్చని అమర్ గ్యాంగ్ స్కెచ్ వేసింది. తొలుత అనారోగ్య సమస్యలో ఇద్దరు మహిళలు ఆశ్రమంలో […]

నాగోల్ లో భార్య గొంతు కోసిన భర్త….

Nagole Supraja Hospital

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నాగోల్ (Nagole) పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం వెలుగులోకి వచ్చింది. భార్య గొంతు భర్త కోశాడు. దీంతో వెంటనే ఆమెను సుప్రజ ఆస్పత్రికి (Supraja Hospital) తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గత సంవత్సరం మహాలక్ష్మి(20)ని వేణుగోపాల్ కు వివాహం చేసుకున్నాడు. వివాహ వేడుకలో అల్లుడికి రూ. 20 లక్షల కట్నం ఆమె తల్లిదండ్రులు ముట్టజెప్పారు.  అదనపు కట్నం […]

పట్టపగలే దొంగల చేతివాటం.. బైక్‌ డిక్కీ నుంచి భారీగా నగదు చోరీ

Rangareddy Shankarpally

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలే దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. అందరూ చూస్తుండగానే.. ద్విచక్రవాహనం డిక్కీలోంచి నగదును ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. ఎర్వగూడ గ్రామానికి చెందిన ప్రదీప్ గౌడ్ అనే వ్యక్తి శంకర్‌పల్లిలోని (Rangareddy Shankarpally) హనుమాన్ నగర్‌లో నివాసం ఉంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన డ్వాక్రా గ్రూప్‌నకు సంబంధించిన రూ.2.98 లక్షల నగదును యూనియన్ బ్యాంక్‌ను వద్దకు తీసుకెళ్లారు. క్యూలైన్‌ ఎక్కువగా ఉండటంతో వాహనం డిక్కీలో ఉంచి సమీపంలోనే ఉన్న […]

హెచ్ పి పెట్రోల్ బంకులో మోసాలు…. లీటర్ పెట్రోల్ లో అర లీటర్ నీళ్లు

Ibrahimpatnam Serriguda HP Petrol Bunk

ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహాంపట్నం మండలం శెర్రిగూడ హెచ్ పి పెట్రోల్ బంక్‌లో నీళ్లు కలిసిన పెట్రోల్ కలకలం సృష్టించింది. శుక్రవారం రాత్రి మహేష్ అనే వ్యక్తి పెట్రోల్ కొట్టించుకోగా ఈ రోజు తన కారు ఆగిపోయింది. బంక్ వద్దకు వచ్చి వాటర్ బాటిల్‌లో పెట్రోల్ కొట్టించగా, అందులో కూడా నీళ్లు ఉన్నట్లు తేలడంతో సిబ్బందితో ఘర్షణ పడ్డాడు. లీటర్ పెట్రల్ లో అర లీటర్ నీళ్లు కలుపుతున్నారని వాహనదారులు వాపోతున్నారు. పెట్రోల్ లో నీళ్లు కలపడంతో […]

పట్టపగలే భారీ దారి దోపిడీ

కారులో డబ్బులు తీసుకెళ్తున్న వ్యక్తులను మరో కారులో అడ్డగించి, భారీ దోపిడీకి పాల్పడిన సంఘటన రంగారెడ్డి జిల్లా, శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం సంచలనం సృష్టించింది. పోలీసులు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి రాకేష్ అగర్వాల్ తన వ్యాపార లావాదేవీలకు సంబంధించిన రూ.40 లక్షలను వికారాబాద్‌లోని తమ కస్టమర్ నుంచి తీసుకుని రావాల్సిందిగా తన వద్ద పని చేసే ఇద్దరు వ్యక్తులను అక్కడికి పంపాడు. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో వికారాబాద్ […]