మాటలతో కాదు.. పనితోనే నిరూపించాలని అనుకున్నా

బాల బుక్స్ పబ్లికేషన్స్ ఉషా ప్రత్యూషతో విమల సంభాషణ పుస్తక ప్రచురణ రంగంలోకి మీరు ఎలా వచ్చారు? అందుకు ప్రేరణ ఏమిటి? ఎంత కాలంగా పుస్తకాలు ప్రచురిస్తున్నారు? నాకు చిన్నతనం నుంచే వ్యక్తుల కంటే పుస్తకాలే ఎక్కువ సహాయపడ్డాయి. పుస్తకాలు నాకు స్నేహితుల్లా మారి, నా ఆలోచనలకు దారులు చూపించాయి. మా నాన్నగారి మరణం నాకు జీవితాన్ని వ్యర్థంగా గడపకుండా, ఏదైనా జీవన సాఫల్యం కలిగే దిశగా నడవాలననే ఆలోచనను కలిగించింది. అప్పటికే నాకు సాహిత్యం పట్ల […]

బీసీ అస్తిత్వవాదాన్ని నిలపడం ఇప్పుడు తెలంగాణలో పూరించాల్సిన ఖాళీ

తెలంగాణ అస్తిత్వం అన్న మాటకి మీరు ఇచ్చే నిర్వచనం ఏమిటి? తెలంగాణాకి మాత్రమే పరిమితమైన, ప్రత్యేకమైన గంగా జమునా తెహజీబ్‌లో పెనవేసుకున్న పేగుబంధం. జీవితాన్ని యథాలాపంగా కాక ఒక సం బురంలా గడిపే జీవనం. సబ్బండ వర్ణాలు ఏకమై, కలసి మెలసి జీవనం సాగిస్తూ అన్ని రకాల ఆధిపత్యాల మీద ఎగురవేసే పోరు జెండా. ఒక ధిక్కార స్వరం. తెలంగాణా అస్తిత్వాన్ని ఒక్క మాటలో వివరించలేము. అదొక జీవన విధానం. సాహిత్య, సాంస్కృతిక, కళా రంగాల్లో, ఆ […]

అర్థం కానిది

వలసలు అనివార్యమైన ప్రతిసారీ ఇదే ప్రశ్న ‘ఎందుకిది?’ అని బతకడం కోసమా, సుఖాన్వేషణల కోసమా, అందరినీ చించుకునే ‘స్కిప్’ కోసమా ప్చ్.. తెలియదు వెళ్ళిపోవాలె.. తెంచుకుని, కోసేసుకుని, కత్తిరించుకుని వెళ్ళిపోవాలె కానీ.. ఎక్కడికి?.. తెలియదు.. కానీ వెళ్ళిపోవాలె యూనివర్సిటీలు.. సర్టిఫికెట్లు పాస్‌పోర్టులు.. వీసాలు.. ‘పోర్ట్‌ఔట్’లు వీటిని విడిచిపెడ్తున్నావూ అంటే.. వాడికి చేరువవుతున్నావూ అని అర్థం ‘గివ్‌అండ్టేక్పాలసీ’ ఒకటి, ‘యూస్‌అండ్త్రో’ మరొకటి ‘యూస్‌అండ్ప్రిజర్వ్’ రహస్యం తెలుసుకోవాలె మెడలో ‘సోల్’ ట్యాగ్ గురించీ, జేబులో ఐఐటి గోల్డ్ మెడల్ కాసుబిళ్ళ […]