ఎయిర్‌పోర్టులను తలపించేలా రైల్వేస్టేషన్ల అభివృద్ధి: బండి సంజయ్‌

మంచిర్యాలలో రూ.26 కోట్లతో అమృత్ భారత్ పనులు రూ.3.50 కోట్లతో పుట్‌ఓవర్ బ్రిడ్జి పనులు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ వెల్లడి మంచిర్యాలలో వందే భారత్ రైలు స్టాపేజీ ప్రారంభం మన తెలంగాణ/మంచిర్యాల ప్రతినిధిః కేంద్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్టులను తలపించేలా రైల్వే స్టేషన్ల అభివృద్ధి చేపడుతోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ తెలిపారు. సోమవారం మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో వందే భారత్ 20101 నాగ్‌పూర్-సికింద్రాబాద్ రైలు స్టాపేజీని రాష్ట్ర […]

మురుగు కాలువలో గర్భస్థ శిశువు మృతదేహం

మంచిర్యాల జిల్లా, భీమారం మండల కేంద్రంలో మురుగు కాలువలో సుమారు ఐదు నెలల గర్భస్థ శిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. నెలలు నిండని ఆ పసికందును మురుగు కాలువలో పడేసిన తీరు మాతృత్వానికి మచ్చ తెచ్చే విధంగా ఉందని వాపోయారు. ఈ ఘటన చూసి మానవత్వం మంటకలిసిందని వ్యాఖ్యానించారు. అయితే, పసికందు మృతదేహాన్ని ఎవరు తెచ్చారు..ఎక్కడి నుంచి వచ్చిందో తెలియాల్సి ఉంది. Also Read:ఇందిరమ్మ ఇళ్లకు రూ.1435 కోట్ల చెల్లింపులు

లింగాపూర్ అటవీ బీట్‌లో ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు

అటవీ సిబ్బందిని అడ్డుకున్న గిరిజనులు ఆదివాసీ మహిళల అరెస్టు వార్త కవరేజీకి వెళ్లిన విలేఖరులు…అడ్డుకున్న అటవీ సిబ్బంది మన తెలంగాణ/దండేపల్లి : మంచిర్యాల జిల్లా, దండేపల్లి మండలం, లింగాపూర్ అటవీ బీట్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఈ సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే..లింగాపూర్ గ్రామ శివారులోని 380 కంపార్ట్‌మెంట్‌లో గిరిజనులు పోడు భూముల కోసం అటవీ భూమిని ఆక్రమించుకొని గుడిసెలు వేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు, పోలీసులు శనివారం ఆ గుడిసెలను తొలగించేందుకు వెళ్లడంతో […]