కోటి రూపాయల రివార్డున్న మావో కమాండర్ మృతి

రాంచీ: జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో సోమవారం ఉదయం భద్రతాబలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో కోటి రూపాయల రివార్డు ఉన్న సహదేవ్ సోరెన్ అనే మావోయిస్టు సహా మొత్తం ముగ్గురు నక్సలైట్లు హతమైనట్లు పోలీసులు తెలిపారు. గోర్‌హర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంతిత్రి అడవుల్లో ఉదయం ఆరు గంటల నుంచి భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. సహదేశ్ అలియాస్ ప్రవేశ్ నిషిద్ధ సిపిఐ(మావోయిస్టు) సెంట్రల్ కమిటీ సభ్యుడు. ఆయనపై కోటి రూపాయల […]

ఆసియా కప్ 2025: యుఎఇకి తొలి విజయం

అబుదాబి: ఆసియాకప్‌లో భాగంగా సోమవారం ఒమన్‌తో జరిగిన గ్రూప్‌ఎ మ్యాచ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) 42 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో యుఎఇకి ఇదే తొలి విజయం కావడం విశేషం. ఇక ఒమన్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన యుఎఇ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 172 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఓపెనర్లు అలీషాన్ షరాఫు, మహ్మద్ వసీం అద్భుత బ్యాటింగ్‌తో […]

ముగిసిన హెల్త్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2025

హెల్త్ ఆర్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్‌డబ్ల్యుఈ సెర్చ్ అండ్ హెల్త్ ఇన్నోవేషన్ సమ్మిట్ -2025 సోమవారం ముగిసింది. హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ సమ్మిట్‌లో 13 దేశాల నుండి 2,800 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. 62 మంది ప్రముఖులు, 42 అగ్రశ్రేణి సంస్థల ప్రతినిధులు పాల్గొని ఆరోగ్యరంగంలో వాస్తవ ప్రపంచ సాక్ష్యాలు, కృత్రిమ మేధస్సు, డిజిటల్ హెల్త్, ఇన్నోవేషన్ పై చర్చలు జరిపారు. ఈ సమ్మిట్‌ను రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, ఇండస్ట్రీస్ […]

ఐసిసిప్లేయర్ ఆఫ్‌ది మంత్‌గా సిరాజ్

దుబాయి: టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్, హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ ప్రతిష్ఠాత్మకమైన ఐసిసి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును అందుకున్నాడు. ఆగస్టులో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో, చివరి టెస్టు మ్యాచ్‌లో అసాధారణ బౌలింగ్‌ను కనబరిచిన సిరాజ్ ఏకంగా 9 వికెట్లు పడగొట్టాడు. తీవ్ర ఒత్తిడిలోనూ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అతని ప్రతిభకు గుర్తింపుగా ఆగస్టు నెలకు సంబంధించి ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డును దక్కించుకున్నాడు. […]

వక్ఫ్ సవరణ చట్టం 2025పై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను స్వాగతించిన కెటిఆర్

KTR

వక్ఫ్ సవరణ చట్టం 2025పై సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్వాగతించారు. ఈ చట్టంలోని వివాదాస్పద నిబంధనలపై బిఆర్‌ఎస్ మొదటి నుంచి తన ఆందోళనలను గట్టిగా వినిపించిందని ఆయన పేర్కొన్నారు. ఈ చట్టం ప్రగతిశీలత ముసుగులో దేశంలో విభజన రాజకీయాలకు, మత సామరస్యానికి విఘాతం కలిగించడానికి ప్రయత్నిస్తోందని తాము ఎప్పుడూ చెబుతూనే ఉన్నామని అన్నారు. వక్ఫ్ సవరణ చట్టంలోని సమస్యలపైన తాము పోరాడామని తెలిపారు. ఒక వ్యక్తి ముస్లిం అని ఎవరు […]

17వ మినీ హ్యాండ్‌బాల్ నేషనల్ ఛాంపియన్‌షిప్ గోడపత్రికను ఆవిష్కరించిన సిఎం

తెలంగాణ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 26 నుండి 29 వరకు నిజాం కళాశాలలో జరిగే 17వ హెచ్‌ఎఫ్‌ఐ మినీ హ్యాండ్బాల్ నేషనల్ ఛాంపియన్‌షిప్ పోస్టర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సోమవారం ఆవిష్కరించారు. క్రీడలకు ప్రోత్సాహాన్ని అందిస్తూ, రాష్ట్రంలోని యువత క్రీడల వైపు మరింత ఆసక్తితో ముందడుగు వేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి సుమారు 1200 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను […]

కొడంగల్‌లో అంగన్‌వాడీల మెరుపు ధర్నా

ప్రీప్రైమరీ వ్యవస్థతో అంగన్‌వాడీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమవుతుందని, ప్రీప్రైమరీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అంగన్‌వాడీ కార్యకర్తలు వికారాబాద్ జిల్లా, కొడంగల్‌లో కదం తొక్కారు. కొడంగల్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటి ముందు భారీ ఎత్తున అంగన్‌వాడీ కార్యకర్తలు గుమికూడి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. సిఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో ధర్నా నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. ఒక దశలో పోలీసులపై […]

దాయాదుల పోరులో కనిపించన జోష్.. చప్పగా సాగిన భారత్-పాక్ మ్యాచ్

Team India

దుబాయి: ఆసియాకప్ టి20 టోర్నమెంట్ గ్రూప్‌ఎలో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య పోరు జరిగిన సంగతి తెలిసిందే. దుబాయి వేదికగా జరిగిన ఈ మ్యాచ్ చాలా సప్పగా సాగింది. దాయాదుల సమరం అంటే ఇరు దేశాల అభిమానుల్లో ఎనలేని జోష్ నెలకొంటోంది. ఈ మ్యాచ్‌ను చూసేందుకు రెండు దేశాల క్రికెట్ ప్రేమీలు ఎంతో ఆసక్తి చూపుతారు. వేదిక ఏదైనా చిరకాల ప్రత్యర్థుల సమరం చివరి వరకు నువ్వానేనా అన్నట్టు సాగడం అనవాయితీ. కానీ […]

బోనుకు చిక్కిన చిరుత

గత రెండు నెలలుగా మహబూబ్‌నగర్ పట్టణ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా భయపెట్టిన చిరుత ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది. దీంతో పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రెండు, మూడు నెలలుగా పట్టణంలోని తిరుమల దేవుని గుట్ట, వీరన్న పేట తదితర కాలనీలలో చిరుత కనిపించింది. మరికొద్ది రోజులకు చిరుత గుట్ట మీద కొచ్చి సేద తీరడం , తిరిగి వెళ్లిపోవడం చేసింది. ఒక్కొక్కసారి ఇండ్ల సమీపంలో కూడా చిరుత […]

ఢిల్లీ ఎర్రకోటకు కాలుష్య నష్టం

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వాయు నాణ్యత క్షీణిస్తుండడంతో ప్రసిద్ధ ఎర్రకోటకు వేగంగా నష్టం కలుగుతోందని ఇటీవలి అధ్యయనం కనుగొంది. 17వ శతాబ్దపు స్మారక చిహ్నం ఎర్ర ఇసుకరాయి గోడలపై నల్లటి కాలుష్య కారకాలు ఏర్పడుతున్నాయని, ఇది దాని నిర్మాణ, సౌందర్య సమగ్రతను దెబ్బతీసేదిగా ఉందని ఇండోఇటాలియన్ నూతన అధ్యయనం పేర్కొంది. చారిత్రక స్మారకం అయిన ఎర్రకోటను 16391648 మధ్య కాలంలో మొగలు చక్రవర్తి షాజహాన్ కట్టించారు. నల్లటి కాలుష్య కారకాలలో జిప్సమ్, బాస్సనైట్, వెడ్డెలైట్, […]