యుపిఐ లావాదేవీలు రూ.5 లక్షలకు పెంపు

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) యుపిఐ లావాదేవీల పరిమితుల్లో కీలక మార్పులు చేసింది. ఈ కొత్త నిబంధనలు సోమవారం (సెప్టెంబర్ 15) నుండి అమల్లోకి వచ్చాయి. ఈ మార్పులు సాధారణ వినియోగదారులతో పాటు వర్తకులు, వ్యాపారులకు కూడా ఉపయోగపడనున్నాయి. ఇప్పటి వరకు యుపిఐ ద్వారా వ్యక్తిగత లావాదేవీలకు గరిష్ట పరిమితి రోజుకు రూ.1 లక్ష ఉండేది. ఈ పరిమితిలో ఎటువంటి మార్పులు లేవు. అయితే కొన్ని ప్రత్యేక విభాగాలకు మాత్రం యుపిఐ ద్వారా లావాదేవీ […]

మార్కెట్లోకి ఒప్పో ఎఫ్31 5జి సిరీస్

ఒప్పో ఇండియా తన కొత్త ఎఫ్31 5జి సిరీస్‌ను (ప్రో+, ప్రో, బేస్ మోడల్స్) భారత మార్కెట్లో విడుదల చే సింది. ఈ సిరీస్ ప్రారంభ ధర రూ. 22,999 కాగా, సెప్టెంబర్ 19 నుంచి అమ్మకాలు మొదలవుతాయి. స్నాప్‌డ్రాగన్, డైమెన్సిటీ ప్రాసెసర్‌లతో వచ్చే ఈ ఫోన్లు, ఆరేళ్ల పాటు మెరుగైన పనితీరుకు ధృవీకరణ పొందాయి. ఐపి69 వాటర్ రెసిస్టెన్స్, 360ఒ ఆర్మోర్ బాడీ, అధిక వేడిని తట్టుకునే అధునాతన కూలింగ్ సిస్టమ్ దీనిలో ఉన్నాయి. 7,000 […]

గొప్ప సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చాను: గౌర హరి

సూపర్ హీరో తేజ సజ్జా బ్రహ్మాండం బ్లాక్‌బస్టర్ ‘మిరాయ్’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్‌ఫుల్ పాత్ర పోషించారు. రితికా నాయక్ హీరోయిన్‌గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. తాజాగా విడుదలైన ఈ చిత్రం బ్రహ్మాండం బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకుని అద్భుతమైన కలెక్షన్స్‌తో హౌస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ గౌర […]

ఇమిగ్రేషన్ దుష్ఫలితం.. భారతీయుడి హత్యపై ట్రంప్ స్పందన

హుస్టన్: అమెరికాలోని డల్లాస్‌లో మోటెల్ మేనెజర్ అయిన ఓ భారతీయ సంతతి వ్యక్తి దారుణ హత్యను ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. ఇది గర్హనీయం అన్నారు. దేశంలో అక్రమ రీతిలో ఉన్న ఇమిగ్రేషన్ విధానంతోనే ఇటువంటి దురాగతాలు జరుగుతున్నాయని విమర్శించారు. అక్రమ విదేశీయుడు, ఇంతకు ముందు నేరచర్యల రికార్డు ఉన్న క్యూబా వలసదారు చేతిలోనే అత్యంత క్రూరంగా ఈ భారతీయ సంతతి వ్యక్తి హతుడు కావడం బాధాకరం అన్నారు. కర్నాటకు చెందిన 50 సంవత్సరాల చంద్రమౌళి బాబ్ […]

కేరళలో ప్రాణాంతక అమీబా.. మెదడు కణాలు తినేసే రకం.. 18మంది మృతి

తిరువనంతపురం ః కేరళలో మనిషి మెదడు కణాలను తినేసే ప్రాణాంతక సూక్ష్మజీవి అమీబా విరుచుకుపడింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ అమీబా బాధిత కేసులు 67 వరకూ అధికారికంగా వెలుగులోకి వచ్చాయి, ఈ ఏడాది ఇప్పటికే 18 మంది వరకూ ఈ సూక్ష్మజీవుల కాటుతో మృతి చెందారు. సవరించిన లెక్కలను ఇప్పుడు సోమవారం అధికారికంగా మీడియాకు వెలువరించారు. సంబంధిత కేసులు పెరిగిపోతూ ఉండటంతో పరిస్థితిపై రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జి స్పందించారు. అత్యవసర రీతిలో మంచినీటి […]

అక్టోబర్ 1 నుంచి రైల్వే టికెట్ బుకింగ్‌లో కొత్త నిబంధనలు

రైల్వే టికెట్ బుకింగ్ వ్యవస్థలో పారదర్శకత పెంచేందుకు, మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి జనరల్ రిజర్వేషన్ టికెట్‌ల బుకింగ్‌కు కూడా ఆధార్‌ను తప్పనిసరి చేయబోతోంది. ఈ నిబంధన బుకింగ్ ప్రక్రియ మొత్తానికి కాకుండా, టికెట్లు అందుబాటులోకి వచ్చిన మొదటి 15 నిమిషాల వరకు మాత్రమే వర్తిస్తుంది. ప్రస్తుతం తత్కాల్ టికెట్‌లు బుక్ చేసుకోవాలంటే ఐఆర్‌సిటిసి ఖాతాకు ఆధార్ అనుసంధానం తప్పనిసరిగా ఉంది. ఇప్పుడు ఈ విధానాన్ని జనరల్ […]

వంతరాపై సుప్రీం కోర్టు క్లీన్‌చిట్

Supreme Court

న్యూఢిల్లీ : గుజరాత్ లోని జామ్‌నగర్‌లో జులాజికల్ రిస్కు, రీహేబిలిటేషన్ (వన్యమృగ ప్రమాద నివారణ, పునరావాస ) కేంద్రం వంతరాపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం క్లీన్‌చిట్ ఇచ్చినట్టు సుప్రీం కోర్టు సోమవారం వెల్లడించింది. ఈ కేంద్రానికి ఏనుగుల తరలింపును సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని జస్టిస్ పంకజ్ మిథల్, జస్టిస్ పిబి వరాలేలతో కూడిన ధర్మాసనం విచారించింది. వంతరాపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఇచ్చిన నివేదికను పరిశీలించిన అనంతరం ఈ విషయంపై […]

కోటి రూపాయల రివార్డున్న మావో కమాండర్ మృతి

రాంచీ: జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో సోమవారం ఉదయం భద్రతాబలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో కోటి రూపాయల రివార్డు ఉన్న సహదేవ్ సోరెన్ అనే మావోయిస్టు సహా మొత్తం ముగ్గురు నక్సలైట్లు హతమైనట్లు పోలీసులు తెలిపారు. గోర్‌హర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంతిత్రి అడవుల్లో ఉదయం ఆరు గంటల నుంచి భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. సహదేశ్ అలియాస్ ప్రవేశ్ నిషిద్ధ సిపిఐ(మావోయిస్టు) సెంట్రల్ కమిటీ సభ్యుడు. ఆయనపై కోటి రూపాయల […]

ఆసియా కప్ 2025: యుఎఇకి తొలి విజయం

అబుదాబి: ఆసియాకప్‌లో భాగంగా సోమవారం ఒమన్‌తో జరిగిన గ్రూప్‌ఎ మ్యాచ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) 42 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో యుఎఇకి ఇదే తొలి విజయం కావడం విశేషం. ఇక ఒమన్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన యుఎఇ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 172 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఓపెనర్లు అలీషాన్ షరాఫు, మహ్మద్ వసీం అద్భుత బ్యాటింగ్‌తో […]

ముగిసిన హెల్త్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2025

హెల్త్ ఆర్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్‌డబ్ల్యుఈ సెర్చ్ అండ్ హెల్త్ ఇన్నోవేషన్ సమ్మిట్ -2025 సోమవారం ముగిసింది. హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ సమ్మిట్‌లో 13 దేశాల నుండి 2,800 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. 62 మంది ప్రముఖులు, 42 అగ్రశ్రేణి సంస్థల ప్రతినిధులు పాల్గొని ఆరోగ్యరంగంలో వాస్తవ ప్రపంచ సాక్ష్యాలు, కృత్రిమ మేధస్సు, డిజిటల్ హెల్త్, ఇన్నోవేషన్ పై చర్చలు జరిపారు. ఈ సమ్మిట్‌ను రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, ఇండస్ట్రీస్ […]