సిఎం రేవంత్ రెడ్డి గోబెల్స్‌ను మించిపోయారు:హరీష్ రావు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. గోబెల్స్‌ను మించిపోయారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ, మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి మాటలు వింటే అబద్ధాలు సైతం ఆత్మహత్య చేసుకుంటాయన్నారు. మూసీకి ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ నీళ్లు వస్తున్నాయని రేవంత్ పచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. కెసిఆర్ కట్టిన కాళేశ్వరం నీళ్లతోనే సిఎం రేవంత్ రెడ్డి.. మూసీ ప్రాజెక్టును చేపట్టారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజక్టులో భాగంగానే మల్లన్నసాగర్‌కు నీళ్లు వస్తున్నాయన్నారు తెలిపారు. కెసిఆర్ నిర్మించిన మల్లన్నసాగర్ హైదరాబాద్‌కు వరంగా మారిందని స్పష్టం … Read more