పక్షవాతం వచ్చింది.. ఆ బాధ మాటల్లో చెప్పలేను: శ్రేయస్

Shreyas Iyer

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మంచి ప్రదర్శనే చేస్తున్నప్పటికీ.. టీం ఇండియా స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌కు (Shreyas Iyer) ఆసియాకప్-2025లో ఆడే అవకాశం రాలేదు. ఈ నేపథ్యంలో సెలక్టర్లుపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే శ్రేయస్‌కు ఊరటనిస్తూ.. త్వరలో ఆస్ట్రేలియా ఎతో తలపడే ఇండియా ఎ జట్టుకు అతన్ని కెప్టెన్‌గా నియమించారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రేయస్ తనకు జరిగిన ఓ బాధాకరమైన సంఘటన గురించి పంచుకున్నాడు. 2023లో తనకు వెన్నునొప్పి సమస్య వచ్చిందని.. […]

దుల్కర్‌ కు జోడీగా పూజా హెగ్డే.. వీడియో రిలీజ్

మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌ టాలీవుడ్ లో తన జోరు చూపిస్తున్నాడు. తెలుగులో దుల్కర్ చేసిన ‘మహానటి’, ‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా మరో తెలుగు మూవీ చేస్తున్నాడు. DQ41 రూపొందుతున్న ఈ సినిమాలో దుల్కర్ కు జోడీగా అందాల తార పూజాహెగ్డే నటిస్తోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ బుధవారం మేకర్స్ వీడియోను వదిలారు. ఇందులో దుల్కర్-పూజా మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేలా ఉంది. […]

జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కు ఓటేస్తే మీ ఇంటిని కూలగొట్టే లైసెన్స్ ఇచ్చినట్టే: కెటిఆర్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే, తమ ఇండ్లను కూలగొట్టేందుకు ప్రభుత్వానికి లైసెన్స్ ఇచ్చినట్టేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ హెచ్చరించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టడమేనా ప్రశ్నించారు. హైడ్రా పేరుతో బిల్డర్లను బెదిరించి కాంగ్రెస్ నేతలు కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఉప ఎన్నికలలో కారు గుర్తుకు ఓటేసి కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డి అహంకారాన్ని బొందపెట్టాలని జూబ్ల్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో బుధవారం జరిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల […]

‘రాజకీయ సన్యాసం చేస్తా’.. రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు

Raja Singh

హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు ఇప్పుడున్న కమిటీతో బిజెపి రాష్ట్రంలో అధికారంలోకి వస్తే.. తాను రాజకీయ సన్యాసం చేస్తానని అన్నారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయను అన్న రాజాసింగ్.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రాజీనామా చేస్తే తాను చేస్తానని అన్నారు. ఇద్దరూ కలిసి ఎన్నికలకు వెళ్ధాం అని సవాల్ చేశారు. బిజెపి తనకు ఎలాంటి సహకారాలు అందించలేదని.. పార్టీలో తాను ఎలాంటి పదవి ఆశించలేదని స్పష్టం చేశారు. ‘‘ఢిల్లీ […]

సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేశాం: చంద్రబాబు

Chandrababu Naidu

అనంతపురం: తెలుగుతమ్ముళ్ల స్పీడు.. జనసేన జోరు.. కమలదళం ఉత్సాహానికి ఎదురుందా.. అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అన్నారు. అనంతపురం‌లో నిర్వహించిన ‘సూపర్‌ సిక్స్-సూపర్ హిట్’ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎపి డిప్యూటీ సిఎం, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్, ఎపి బిజెపి చీఫ్ పి.వి.ఎన్.మాధవ్ హాజరయ్యారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత కూటమిలోని మూడు పార్టీలు కలిసి నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ ఇది కావడం విశేషం. ఈ సభలో […]

బుమ్రాను ఆడిస్తే ఊరుకొనేదిలేదు.. మాజీ క్రికెటర్ వార్నింగ్

Ajay Jadeja

ఆసియాకప్-2025లో టీం ఇండియా తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతోంది. తొలి పోరులో పసికూన యుఎఇతో భారత్ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో తలపడే జట్టు కూర్పుపై కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌లు కసరత్తు చేస్తున్నారు. ఎవరిని ఆడించాలి, ఎవరిని పక్కన పెట్టాలని ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఈ మ్యాచ్‌లో ఆడిస్తే ఊరుకొనేది లేదని టీం ఇండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా (Ajay Jadeja) హెచ్చరించారు. బుమ్రాను జాగ్రత్తగా […]

ఉపఎన్నికలో గెలుపే గోపినాథ్‌కు సరైన నివాళి: కెటిఆర్

KTR

హైదరాబాద్: అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరుగుతుందని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ (KTR) అన్నారు. మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఎన్నికలో విజయం సాధించాలని బిఆర్ఎస్ పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ పార్టీ కార్యకర్తలతో కెటిఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భారీ మెజారిటీతో బిఆర్ఎస్ గెలుపే గోపీనాథ్‌కు సరైన […]

మెగా ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. తండ్రైన హీరో వరుణ్ తేజ్

Varun Tej

హైదరాబాద్: మెగా అభిమానులకు గుడ్‌న్యూస్. మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు, హీరో వరుణ్ తేజ్ (Varun Tej) తండ్రయ్యారు. నవంబర్ 2023లో వరుణ్, లావణ్యలు వివాహ బంధంతో ఒకటయ్యారు. ఈ ఏడాది మేలో తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఈ దంపతులు ప్రకటించారు. ఈరోజు (సెప్టెంబర్ 10న) వరుణ్ భార్య లావణ్య త్రిపాఠి రెయిన్‌బో హాస్పిటల్‌లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా వరుణ్ దంపతులకు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. […]

టి-20 సిరీస్‌కి ముందు సౌతాఫ్రికాకు బిగ్ షాక్

David Miller

మూడు వన్డేలు, మూడు టి-20ల సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. ఇప్పటికే ఆతిథ్య జట్టుతో జరిగిన వన్డే సిరీస్‌ని సఫారీ జట్టు 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇవాళ్టి (సెప్టెంబర్ 10) నుంచి ఇరు జట్ల మధ్య టి-20 సిరీస్ ప్రారంభంకానుంది. అయితే ఈ మ్యాచ్‌కి ముందు సౌతాఫ్రికా జట్టకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా కీలక ఆటగాడు డేవిడ్ మిల్లర్ (David Miller) ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఇటీవల […]

వివాదాస్పద కేసులో.. పృథ్వీషాకు జరిమానా విధించిన కోర్టు

Prithvi Shaw

ముంబై: టీం ఇండియా యువ క్రికెటర్ పృథ్వీషాకు (Prithvi Shaw) ముంబైలోని దిండోషి సెషన్స్‌ కోర్టు జరిమానా విధించింది. యూట్యూబర్ సప్నాగిల్‌.. పృథ్వీషా మధ్య జరిగిన వివాదం కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. అయితే ఈ కేసులో సప్నా వేసిన పిటిషన్‌కు సమాధానం దాఖలు చేయడంలో విఫలమైనందున పృథ్వీషాను రూ.100 జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. షా తరఫు న్యాయవాదికి జూన్ 13నే చివరి అవకాశం కల్పించారు. కానీ, ఇప్పటివరకూ అతడి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. […]